తెలంగాణ

telangana

ETV Bharat / business

Income Tax Returns For FY21: 3కోట్ల ఐటీ రిటర్న్స్‌ దాఖలు: కేంద్రం - ఇప్పటి వరకు దాఖలైన ఐటీ రిటర్నులు

Income Tax Returns For FY21: 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటివరకు సుమారు 3 కోట్లకు పైగా ఐటీ రిటర్నులు దాఖలైనట్లు కేంద్రం తెలిపింది. మిగత వారు కూడా తొందరగా చేసుకోవాలి కోరింది.

income tax returns for FY21
ఐటీ రిటర్న్స్‌

By

Published : Dec 5, 2021, 7:30 PM IST

Income Tax Returns For FY21: గత ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించి ఇప్పటి వరకు 3 కోట్ల ఐటీ రిటర్నులు దాఖలయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఇప్పటి వరకు రిటర్నులు దాఖలు చేయని వారు వీలైనంత తొందరగా చేసుకోవాలని సూచించింది. 2020-21 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలుకు డిసెంబర్‌ 31 వరకు గడువు ఉంది.

రోజుకు 4 లక్షల రిటర్నులు దాఖలవుతున్నాయని, చివరి నిమిషయంలో గందరగోళం ఏర్పడకుండా పన్ను చెల్లింపుదారులు వీలైనంత తొందరగా రిటర్నులు దాఖలు చేయాలని ఆర్థిక శాఖ కోరింది. ఈ మేరకు పన్ను చెల్లింపుదారులకు ఈ-మెయిల్స్‌, ఎస్సెమ్మెస్‌, మీడియా ద్వారా సమాచారం చేరవేస్తోంది.

ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ ద్వారా రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఫారం 26 ఏఎస్‌, యాన్యువల్‌ ఇన్ఫర్మేన్‌ స్టేట్‌మెంట్‌ (ఏఐఎస్), ఇతర పత్రాలను తప్పకుండా సరి చూసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. మొత్తంగా దాఖలైన ఐటీ రిటర్నుల్లో 52 శాతం పోర్టల్‌లోని ఆన్‌లైన్‌ ఐటీఆర్‌ ఫారంను ఉపయోగించి చేశారని, మిగిలినవి ఆఫ్‌లైన్‌ సాఫ్ట్‌వేర్‌ యుటిలిటీ ద్వారా రూపొందించిన ఐటీఆర్‌ ఫారాలను ఉపయోగించారని పేర్కొంది. రిఫండ్స్‌ కోసం పాన్‌తో లింక్‌ అయిన బ్యాంక్‌ ఖాతానే ఇవ్వాలని సూచించింది.

ఇదీ చూడండి:'ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లు యథాతథమే!'

ABOUT THE AUTHOR

...view details