ఆగస్టు నెలలోనే భారత్లో 20,70,000 వాట్సాప్(WhatsApp Ban) అకౌంట్లను నిషేధించినట్లు సామాజిక మాధ్యమం వాట్సాప్(WhatsApp News) ఇటీవలే విడుదల చేసిన మంత్లీ కంప్లియన్స్ నివేదికలో పేర్కొంది. మొత్తంగా 420 ఫిర్యాదులను స్వీకరించినట్లు స్పష్టం చేసింది. +91తో కూడిన నంబర్లను భారత అకౌంట్లుగా గుర్తించినట్లు వాట్సాప్ వెల్లడించింది.
95 శాతానికి పైగా వాట్సాప్ ఖాతాలను.. అనధికారిక బల్క్ మెసేజింగ్(స్పామ్) కారణంగా తొలగించినట్లు గతంలో వాట్సాప్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా నెలకు సగటున 80 లక్షల ఖాతాలను బ్యాన్ చేస్తున్నట్లు తెలిపింది.
ఆగస్టులో వాట్సాప్ స్వీకరించిన 420 ఫిర్యాదుల్లో.. అకౌంట్ సపోర్ట్(105), బ్యాన్ అప్పీల్(222), ఇతర సపోర్ట్(34), ప్రొడక్ట్ సపోర్ట్(42), సేఫ్టీ(17)కి సంబంధించి ఉన్నాయని సామాజిక మాధ్యమం వెల్లడించింది. 41 ఖాతాలపై యాక్షన్ తీసుకున్నట్లు స్పష్టం చేసింది.