WhatsApp account banned: అక్టోబర్‌లో 20 లక్షల భారతీయుల ఖాతాలపై నిషేధం విధించింది దిగ్గజ మెసేజింగ్ సంస్థ వాట్సాప్. ఆ నెలలో సంస్థకు 500 ఫిర్యాదు నివేదికలు అందినట్లు తెలిపింది. వేధింపులను అరికట్టడం సహా యూజర్ల భద్రత కోసం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు కంప్లయన్స్ రిపోర్ట్‌లో వివరించింది.
20 లక్షల భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం!
WhatsApp account banned: వేధింపులను అరికట్టే చర్యల్లో భాగంగా 20 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించింది వాట్సాప్. అక్టోబర్‌లో సంస్థకు ఐదు వందల ఫిర్యాదులు అందినట్లు తెలిపింది.
whatsapp account banned
95 శాతానికి పైగా ఖాతాలను.. బల్క్ మెసేజింగ్‌ను దుర్వినియోగం చేసినందువల్లే బ్యాన్ చేసినట్లు వాట్సాప్ తెలిపింది. ఈ వేదికపై వేధింపులను అరికట్టేందుకు నెలవారీగా సుమారు 80 లక్షల ఖాతాలను నిషేధిస్తోంది వాట్సాప్. సెప్టెంబర్‌లోనూ 560 ఫిర్యాదు నివేదికలు అందగా, 22 లక్షల భారతీయుల ఖాతాలను నిలిపేసింది.
ఇదీ చూడండి:నంబర్ సేవ్ చేయకుండా వాట్సాప్‌లో మెసేజ్ చేయండిలా..