కరోనా రెండో దశ కుదిపేసినప్పటికీ దేశీయ కంపెనీలు ఉద్యోగులకు వేతనాల పెంపుపై (Salary Hike) సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఈ ఏడాది వేతనాల పెంపు 8.8 శాతంగా ఉండే అవకాశముందని ఎయాన్ ఇండియా 26వ వార్షిక సర్వేలో (Aon survey) వెల్లడైంది. వచ్చే ఏడాది వేతనాల పెంపు 9.4 శాతంగా ఉండొచ్చని తెలిసింది.
2022లో ఆ ఉద్యోగులకు భారీగా వేతనాల పెంపు! - వేతనాల పెంపుపై ఎయాన్ సర్వే
కరోనా మహమ్మారి వల్ల చాలా కంపెనీలు ఉద్యోగాల (Jobs Cut) కోత, వేతనాల తగ్గింపు వంటి చర్యలకు దిగాయి. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి. ఎయాన్ ఇండియా చేసిన సర్వేలో (Aon survey) పలు కంపెనీలు వేతనాల పెంపుపై సానుకూలంగా స్పందించటమే ఇందుకు కారణం. సర్వేలో తెలిసిన పలు ఆసక్తికర విషయాలు ఇలా ఉన్నాయి.
వేతనాల పెంపు
సర్వేలోని ముఖ్యాంశాలు..
- వ్యాపారాలు 2022పై ఆశావాద దృక్పథంతో ఉన్నాయి.
- సర్వేలో పాల్గొన్న మొత్తం కంపెనీల్లో 98.9 శాతం.. వేతనాల పెంపుపై సానుకూలంగా స్పందించాయి.
- 2021కు సంబంధించి వేతనాల పెంపుపై 97.5 శాతం కంపెనీలే సానుకూల సంకేతాలు ఇచ్చాయి.
- మెజారిటీ కంపెనీల్లో పాజిటివ్ సెంటిమెంట్ ఉంది. అందులో చాలా కంపెనీలు 2022లో వేతనాల పెంపును 2019 స్థాయికి తెచ్చే యోచనలో ఉన్నాయి.
- టెక్, ఈ-కామర్స్, ఐటీ సేవల సంస్థలు 2022లో అత్యధికంగా 10 శాతం వరకు వేతనాలు పెంచేందుకు సుముఖత వ్యక్తం చేశాయి.
- ఆతిథ్య, ఇంజినీరింగ్, ఎనర్జీ రంగంలోని సంస్థలు 2022లోనూ వేతనాల పెంపు అంతంత మాత్రంగానే ఉండొచ్చని తెలిపాయి.
ఇదీ చదవండి:ఆ దేశంలో అధికారిక కరెన్సీగా బిట్‌కాయిన్