తెలంగాణ

telangana

By

Published : Jan 14, 2021, 8:18 PM IST

ETV Bharat / business

ప్రశ్నలన్నింటికీ సమాధానమిస్తాం: వాట్సాప్

వాట్సాప్​ సరికొత్త ప్రైవసీ విధానాలను సమీక్షించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చేందుకు సిద్ధమేనని వాట్సాప్ ప్రకటించింది. ప్రత్యర్థి కంపెనీలతో పోటీపడి.. వినియోగదారుల నమ్మకాన్ని పొందుతామని ధీమా వ్యక్తం చేసింది. ఈ మేరకు వాట్సాప్​ హెడ్‌ 'విల్‌ కేత్‌కార్ట్‌' పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

wtsapp head interview with pti
వాట్సాప్ గోప్యతా విధానాలు

వాట్సాప్-ఫేస్​బుక్​ సమాచార మార్పిడికి అనుసరించే నియమ, నిబంధనలపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ వివరణ కోరనున్న తరుణంలో వాట్సాప్‌ స్పందించింది. భారత వినియోగదారుల డేటా భద్రతపై తాము రాజీ పడబోమని.. ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు స్పష్టతనిస్తామని.. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు వాట్సాప్​ హెడ్​​ విల్‌ కేత్‌కార్ట్.

తమ వ్యక్తిగత సంభాషణలు, చాట్‌లను ఎవ్వరూ చూడలేరని ప్రజలకు నమ్మకం ఉండాలి. అందుకు వారికి తగిన ఎంపికలు ఉండాలి. వాట్సాప్​ను వదిలి వెళ్తున్న వారికి ఇతర సంస్థలు ఆ భద్రతను కల్పిస్తాయా? లేదా? అనేది చెప్పలేం. వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు పోటీ పడాలి. డేటా భద్రతపై జరుగుతున్న పరిణామాలు ఆహ్వానించదగినవి.

-విల్‌ కేత్‌కార్ట్‌, వాట్సాప్​ హెడ్​​.

పోటీ మంచిదే..

వాట్సాప్​ను ఆదరిస్తున్న వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నామని కేత్‌ వివరించారు. గోప్యతపై పోటీ మంచిదని భావిస్తున్నట్టు.. దీనివల్ల భవిష్యత్​లో ప్రైవసీ మరింత మెరుగవుతుందని తెలిపారు. తమ వినియోగదారుల మెస్సేజ్​లు ఎండ్​-టు-ఎండ్ ఎన్​క్రిప్షన్​ ఆధారంగా ఉంటాయని.. ఫలితంగా వారి గోప్యతకు ఎటువంటి భంగం వాటిల్లదని స్పష్టం చేశారు. వాట్సాప్​ నూతన ప్రైవసీపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో సిగ్నల్, టెలిగ్రామ్​ యాప్​ల డౌన్​లోడ్లు పెరుగుతున్నాయనే ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానామిచ్చారు.

అందుకే ఈ అప్​డేట్​..

ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్‌కు సంబంధించిన విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదని ఉద్ఘాటించారు కేత్​. సేవల్లో మరింత పారదర్శకత కోసం మాత్రమే ఈ అప్​డేట్​ ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. గతంలో సమాచార దుర్వినియోగంపై వాట్సాప్ అనేక చర్యలు చేపట్టిందని ఆయన గుర్తుచేశారు.

మారుమూల ప్రాంతాల్లోనూ వ్యాపారాన్ని నిర్వహించే విధంగా వాట్సాప్ బిజినెస్​ అకౌంట్లకు నూతన ప్రైవసీ విధానాలు దోహదపడతాయని తెలిపారు. వాట్సాప్‌లో షాపింగ్ అనుభవాన్నీ తీసుకురాబోతున్నట్టు తెలిపారు.

ఇదీ చదవండి:వాట్సాప్ కొత్త రూల్స్​పై కేంద్రం నజర్

ABOUT THE AUTHOR

...view details