సౌదీ అరేబియా నేతృత్వంలోని ఒపెక్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తిని పెంచేందుకు యోచిస్తున్నాయి. చమురు ధరలు కరోనా పూర్వ స్థితికి చేరిన నేపథ్యంలో గురువారం ఆన్లైన్ వేదికగా జరిగే సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోనున్నాయి. వైరస్ కొత్త వేరియంట్ వ్యాప్తి చమురు ఉత్పత్తి డిమాండ్‌పై ప్రభావం చూపవని ఆయా దేశాలు భావిస్తున్నాయి.
చమురు ఉత్పత్తి పెంపునకు ఒపెక్ దేశాల నిర్ణయం! - చమురు ఉత్పత్తి పెంపు
ఒపెక్ దేశాలు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ధరలు కరోనా పూర్వ స్థితికి చేరినందున చమురు ఉత్పత్తిని పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం.
రోజుకు 5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని పెంచుతూ గత డిసెంబర్లో నిర్ణయం తీసుకున్న 'ఒపెక్ ప్లస్' దేశాలు.. మరో 5 లక్షల బ్యారెళ్ల మేర ఉత్పత్తిని పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ, సౌదీ అరేబియా రోజుకు 10 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు జనవరిలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. మరి ఈ నిర్ణయాన్ని సౌదీ అరేబియా వెనక్కితీసుకుంటుందా అనే దానిపై స్పష్టత రాలేదు.
ఇదీ చదవండి:ఎఫ్‌డీఐల వెల్లువ- 9 నెలల్లో 40% వృద్ధి