కొవిడ్-19 మహమ్మారి ప్రభావం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నాయి సౌదీ అరేబియా నేతృత్వంలోని చమురు ఉత్పత్తి, ఎగుమతి చేసే ఒపెక్ దేశాలు. మే నుంచి జులై వరకు చమురు ఉత్పత్తిని క్రమంగా పెంచనున్నట్లు తెలిపాయి. రోజుకు 2 మిలియన్ (20 లక్షలు) బ్యారెళ్లు ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించాయి.
గత ఏడాది కరోనా కారణంగా డిమాండ్ తగ్గి ధరలు భారీగా పడిపోయిన క్రమంలో ఉత్పత్తిని తగ్గించాయి ఒపెక్ దేశాలు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఆర్థిక రంగం క్రమంగా పట్టాలకెక్కుతున్న తరుణంలో ఉత్పత్తిని పెంచుతున్నాయి.