2019తో పోలిస్తే 2020లో డిజిటల్ చెల్లింపులు 80శాతం పెరిగాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా టైర్2, టైర్3 నగరాల్లో డిజిటల్ నగదు వినియోగం బాగా పెరిగిందని రాజోర్‌పే అనే ఫైనాన్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నెట్‌బ్యాంకింగ్, వాలెట్ల వాడకం సులువుగా ఉండటంతో 2020లో వాటి వినియోగం 120శాతం పెరిగిందని తెలిపింది. లాక్‌డౌన్ ప్రారంభంలో డిజిటల్ చెల్లింపులు 30శాతం తగ్గినా, తర్వాతి 70 రోజుల్లో వీటి వినియోగం చాలా పెరిగిందని ఈ సర్వే పేర్కొంది. ముఖ్యంగా గతేడాది జులై నుంచి డిసెంబరు మధ్య కాలంలో 73శాతం పెరుగుదల నమోదైంది. మొత్తంగా గ్రామాల నుంచి నగరాల వరకూ ఒక్క ఏడాదిలోనే 92శాతం పెరుగుదల ఉందని ఈ సర్వేలో తేలింది.
2020లో 80శాతం పెరిగిన డిజిటల్ చెల్లింపులు - online banking latest news
నెట్‌బ్యాంకింగ్, వాలెట్ల వాడకం సులభంగా ఉంటడం వల్ల డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించింది. 2019తో పోలిస్తే 2020లో వీటి వినియోగం 80శాతం వృద్ధి చెందినట్లు పేర్కొంది. ముఖ్యంగా టైర్2, టైర్3 నగరాల్లో డిజిటల్ నగదు వినియోగం భారీగా పెరిగింది.
అన్ని రాష్ట్రాల్లోకి చంఢీఘర్‌లో 205శాతం పెరుగుదల నమోదైందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు కూడా డిజిటల్ చెల్లింపుల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించాయి. యూపీఐ పేమెంట్లను 2020లో ఎక్కువగా జరిగాయి. కరోనా సంక్షోభం కారణంగా చాలామంది తమ వ్యాపారాలను ఆన్‌లైన్‌లో చేయడంతో డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యత ఏర్పడిందని రాజోర్‌పే సీఈవో హర్షిల్ మాథుర్ తెలిపారు. 2020లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ అనేక కొత్త ఆలోచనలకు బీజం పడిందన్నారు. చాలా వరకూ వ్యాపారాలన్నీ కరోనాకు ముందున్న పరిస్థితుల్లోకి చేరిపోయాయని ఆయన తెలిపారు. గత ఆరు నెలల్లో రాజోర్‌పే 40-45శాతం వృద్ధిని నమోదు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ సంస్థ ఫేస్‌బుక్, ఎయిర్‌టెల్, ఓలా, జొమాటో, బుక్‌మై షో, స్విగ్గీ వంటి అనేక సంస్థల చెల్లింపులను నిర్వహిస్తోంది.