Online income tax return: గత ఆర్థిక సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించేందుకు డిసెంబరు 31 చివరి తేదీ. ఈ లోపు కచ్చితంగా రిటర్నులు దాఖలు చేయాల్సిందే. కొత్తగా తీసుకొచ్చిన ఆదాయపు పన్ను శాఖ వెబ్సైటులో ముందే నింపిన పన్ను పత్రాలు సిద్ధంగా ఉన్నాయి. చేయాల్సిందల్లా.. ఆ వివరాలను ఒకసారి సరిచూసుకొని, అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవడమే. తర్వాత ఇ-వెరిఫై చేయడం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే, మీ ఆదాయం, పన్ను చెల్లించిన వివరాలు ఇన్‌కంట్యాక్స్ వెబ్సైటులో కనిపించకపోతే.. అప్పుడు ఏం చేయాలి?
Income tax return website: ఆదాయం, పన్ను చెల్లింపు వివరాలు ఆదాయపు పన్ను వెబ్సైటులోని మీ ఖాతాలో కనిపించకపోవడానికి పలు కారణాలు ఉండొచ్చు. ఆదాయపు పన్ను శాఖ దీనిపై కొన్ని వివరాలూ తెలియజేస్తోంది.
- మీ దగ్గర పన్ను వసూలు చేసిన వారు మీ వివరాలను నమోదు చేయకపోవడం.
- పన్ను వసూలు చేసే వారికి మీ పాన్ వివరాలు సరిగా ఇవ్వకపోవడం
- పాన్ వివరాల్లో తప్పులు దొర్లడం
- టీడీఎస్/టీసీఎస్ చేసిన వ్యక్తులు/సంస్థలు మీ పాన్ వివరాలను తప్పుగా పేర్కొనడం లేదా పాన్ వివరాలను అసలు తెలియజేయకపోవడం
- పన్ను చెల్లింపునకు సంబంధించిన చలాన్ల వివరాలను తప్పుగా పేర్కొనడంలాంటి సందర్భాల్లో మీ ఆదాయం, పన్ను వివరాలు మీ ఖాతాలో కనిపించకపోవచ్చు.
ఇదీ చూడండి:రుణం తీసుకోవాలా? ఏ అవసరానికి ఏది బెటర్?