తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆన్​లైన్​​ టోకరా: రూ.800 కుర్తాకు రూ.80వేలు దోపిడీ - మహిళ బ్యాంకు ఖాతా నుంచి రూ.80 వేలు దోచుకున్న సైబర్​ నేరగాళ్లు

బెంగళూరులో ఓ మహిళలను సైబర్ నేరగాళ్లుగా నిండా ముంచారు. నకిలీ ఆన్​లైన్​ షాపింగ్ యాప్​లో బాధితురాలు రూ.800 విలువైన కుర్తా ఆర్డర్​ ఇస్తే.. ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.80,000 దోచేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

online frauds
ఆన్​లైన్​​ టోకరా: రూ.800 కుర్తాకు రూ.80వేలు దోపిడీ

By

Published : Nov 27, 2019, 11:18 AM IST

ఓ మహిళ రూ.800ల కుర్తా కోసం ఆన్​లైన్​లో ఆర్డర్ ఇస్తే.. ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.80,000 మటుమాయమైన ఘటన బెంగళూరులో జరిగింది.

నకిలీ యాప్​తో...

దక్షిణ బెంగళూరులోని గొట్టిగెరెకు చెందిన శ్రవణ్న ఓ కుర్తా కొందామనుకున్నారు. నవంబర్​ 8న గూగుల్ ప్లే స్టోర్​ నుంచి ఓ ఆన్​లైన్​ షాపింగ్​ యాప్​ను డౌన్​లోడ్ చేసుకున్నారు. రూ.800 విలువైన ఓ కుర్తాను ఆర్డర్ చేశారు.

ఇలా మోసగించారు..

రోజులు గడుస్తున్నా ఆర్డర్ ఇంటికి రాకపోవడం వల్ల.. ఆమె యాప్​లో ఉన్న కస్టమర్ కేర్​ నెంబర్​కు ఫోన్​ చేశారు. తన ఆర్డర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అందుకు అవతలి వ్యక్తి ఆర్డర్ తప్పక వస్తుందని, అందుకోసం ఓ దరఖాస్తు నింపాల్సి ఉంటుందని ఆమెను నమ్మించాడు. ఆమె ఫోన్​కు ఓ లింక్ పంపించాడు.

మోసం జరుగుతోందని తెలియక.. తన బ్యాంకు ఖాతా వివరాలతో దరఖాస్తు నింపి పంపారు బాధితురాలు. తరువాత ఆమెకు కాల్​ చేసిన అవతలి వ్యక్తి వన్​టైమ్ పాస్​వర్డ్ చెప్పాల్సిందిగా కోరాడు. ఇలా నాలుగైదు సార్లు చేశాడు. ఫలితంగా ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.79,600లు మాయం అయ్యాయి. మోసం గ్రహించిన ఆమె వెంటనే కోననకుంటే పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

ఆన్​లైన్​ మోసగాళ్లతో జాగ్రత్త..

యాప్​లో ఉన్న కస్టమర్​కేర్​ వారితో సంప్రదించడానికి ప్రయత్నించామని, అయితే అప్పటికే మోసగాళ్లు జాగ్రత్తపడ్డారని పోలీసులు తెలిపారు. వినియోగదారులు ఆన్​లైన్ మోసాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

యాపిల్​ ఐఓఎస్​, గూగుల్​ ప్లేస్టోర్​ల్లోని యాప్​లన్నీ సురక్షితమని భావించనక్కరలేదని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇదే అవకాశంగా తీసుకుని ఆన్​లైన్​ మోసగాళ్లు వినియోగదారులను సులభంగా మోసగిస్తున్నారని అంటున్నారు. మాల్​వేర్, స్పైవేర్ ఉన్న యాప్​ల పట్ల వినియోగదారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:రెండు రోజుల్లో 'మహా' పదవుల పంపకాలు!

ABOUT THE AUTHOR

...view details