దేశంలో ఉల్లి ధరలను (Onion rate today) తగ్గించే దిశగా చర్యలు చేపట్టినట్లు కేంద్రం పేర్కొంది. బఫర్ నిల్వలను (Onion buffer stock) విడుదల చేసి ధరలను నియంత్రిస్తున్నట్లు తెలిపింది. ఆలూ, టమాట ధరలను (Tomato price in India) సైతం తగ్గించేందుకు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది. (Onion Price)
ఆగస్టు చివరి వారం నుంచి ఉల్లి బఫర్ స్టాక్‌ను విడుదల (Onion buffer stock) చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. నిల్వ నష్టాలను తగ్గించేందుకు.. 'ముందుగా వచ్చిన స్టాక్‌ను ముందుగా విడుదల' చేసే పద్ధతిని పాటిస్తున్నట్లు వెల్లడించింది. దీని ఫలితంగా అక్టోబర్ 14న ఉల్లి రిటైల్ ధర మెట్రో నగరాల్లో రూ.42-57 మధ్యకు (Onion rate today) చేరిందని తెలిపింది. దేశవ్యాప్తంగా సగటు ధర రూ.37.06కు చేరుకుందని పేర్కొంది. హోల్‌సేల్ ధర కేజీ రూ.30కి పరిమితమైందని వెల్లడించింది.
67 టన్నులు విడుదల