'ఒన్ ప్లస్' కలర్ షిఫ్టింగ్ గ్లాస్ టెక్నాలజీతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కాన్సెప్ట్ ఫోన్ ఎలా ఉండబోతుందో వివరిస్తూ ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది.
రంగులు మార్చే కెమెరా!
హై ఎండ్ కార్ల సన్‌రూఫ్‌లు, ఎయిర్‌క్రాఫ్ట్ విండోల్లో ఉపయోగించే 'కలర్ షిఫ్టింగ్ టెక్నాలజీ'ని 'వన్ ప్లస్' కెమెరాల్లో ఉపయోగిస్తున్నట్లు 'వైర్డ్' తెలిపింది. ఈ సాంకేతికత కోసం 'వన్ ప్లస్' ప్రముఖ కార్ల కంపెనీ మెక్ లారెన్తో కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం.
కెమెరాలు కనిపించవ్..!
'వన్ ప్లస్' విడుదల చేసిన టీజర్ ప్రకారం, ఈ కాన్సెప్ట్ ఫోన్లో కెమెరాలు కనిపించవు. ఎందుకంటే ఇవి హైఎండ్ గ్లాస్ కింద ఉంటాయి. కెమెరా యాప్ ఓపెన్ చేయగానే ఎలక్ట్రికల్ సిగ్నల్ ద్వారా హైఎండ్ గ్లాస్ పారదర్శకంగా మారుతుంది. అప్పుడు ఫొటోలు తీసుకోవడానికి వీలవుతుందని సమాచారం. దీనిపై మరింత స్పష్టత రావాలంటే మరికొంత కాలం వేచిచూడక తప్పదు.
విడుదల ఎప్పుడు?
ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ఈ కాన్సెప్ట్ ఫోన్‌ను జనవరిలోనే తీసుకొస్తున్నట్లు 'వన్ ప్లస్' తన టీజర్లో పేర్కొంది. జనవరి 7 నుంచి 10వ తేదీల మధ్య జరగనున్న 'సీఈఎస్ 2020' ఈవెంట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయనుంది. ప్రత్యేకించి ఏ రోజున విడుదల చేస్తుందో మాత్రం స్పష్టం చేయలేదు.
ఇదీ చూడండి:ఐటీ శాఖ 2020 క్యాలెండర్: ఇక పన్ను కట్టడం మర్చిపోరు