తెలంగాణ

telangana

ETV Bharat / business

జూన్ 1 నాటికి పూర్తి స్థాయిలో 'వన్ నేషన్- వన్ రేషన్ కార్డ్' - one nation one ration card scheme

వన్​ నేషన్- వన్​ రేషన్​ కార్డ్ పథకాన్ని 2020 జూన్​ 1 నాటికి దేశవ్యాప్తంగా అమలుచేయనున్నట్లు కేంద్రమంత్రి రాంవిలాస్ పాసవాన్​ ప్రకటించారు. ఈ పథకం కింద లబ్ధిదారుడు ఒకే రేషన్ కార్డును ఉపయోగించి దేశంలో ఎక్కడైనా రేషన్ పొందగలుగుతారని తెలిపారు.

one nation one ration card scheme
జూన్ 1 నాటికి పూర్తి స్థాయిలో 'వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్'

By

Published : Jan 21, 2020, 2:46 PM IST

Updated : Feb 17, 2020, 9:01 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన ‘'వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్'’ పథకాన్ని జూన్ 1, 2020 నాటికి దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు కేంద్రమంత్రి రాంవిలాస్ పాసవాన్​ సోమవారం ప్రకటించారు.

"జూన్ 1 నాటికి మొత్తం దేశంలో ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్’ పథకాన్ని అమలు చేస్తాం. ఈ పథకం కింద లబ్ధిదారుడు ఒకే రేషన్ కార్డును ఉపయోగించి దేశవ్యాప్తంగా ప్రయోజనాలను పొందగలుగుతారు."

- రాంవిలాస్​ పాసవాన్​, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రి

దేశంలోని 12 రాష్ట్రాల్లో నూతన సంవత్సరం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించినట్లు పాసవాన్​ తెలిపారు. ఈ సదుపాయం కింద, ఈ రాష్ట్రాల లబ్ధిదారులు... వారు నివసిస్తున్న 12 రాష్ట్రాలలో ఎక్కడైనా రేషన్​ను పొందవచ్చని మంత్రి వివరించారు. డిసెంబర్ 30, 2020 నాటికి ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్’ వ్యవస్థ తప్పకుండా దేశం మొత్తం అమలులోకి వస్తుందని చెప్పారు.

ఇదీ చూడండి: ఉబర్ ఈట్స్ ఇకపై జొమాటో సొంతం.. భారత్​లో మాత్రమే

Last Updated : Feb 17, 2020, 9:01 PM IST

ABOUT THE AUTHOR

...view details