High speed electric scooter: బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ వన్‌మోటో మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌తో ముందుకొచ్చింది. 'ఎలెక్టా' పేరుతో హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత విపణిలో విడుదల చేసింది. గత నెలలో బైకా, కమ్యూటా పేర్లతో రెండు మోడల్స్‌ను లాంచ్ చేసిన సంస్థ.. తాజాగా ప్రీమియం విద్యుత్ స్కూటర్ ఎలెక్టాను తీసుకొచ్చింది. ఈ స్కూటర్ ధర రూ.2 లక్షలుగా(ఎక్స్‌షోరూమ్) నిర్ణయించింది.
జియో ఫెన్సింగ్, ఐఓటీ, బ్లూటూత్, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సహా పలు అత్యాధునిక సాంకేతికతను జోడించి ఎలెక్టాను తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. ఎలెక్టాలో 72 వోల్ట్, 45 ఆంపియర్ డిటాచబుల్ లిథియమ్-అయాన్ బ్యాటరీని అమర్చినట్లు వెల్లడించింది. ఈ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించవవచ్చు. గరిష్ఠంగా గంటకు 100 కిలోమీటర్లు వేగంతో దూసుకెళ్లగల ఎలెక్టాలో 4కేడబ్ల్యూ క్యూఎస్ బ్రష్‌లెస్ డీసీ హబ్ ఉంది.