రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ సిద్ధమైనట్లు సమాచారం. అబుదాబికి చెందిన 'ముబ్దాలా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ'.. జియోలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై చర్చలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఈ అంశంపై రెండు కంపెనీలను వేర్వేరుగా సంప్రదించగా.. ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.
'జియో'లో మరో కంపెనీ పెట్టుబడి పెట్టనుందా? - రిలయన్స్ జియో
భారత టెలికమ్ దిగ్గజం రిలయన్స్ జియోలో పెట్టుబడుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 5 కంపెనీలు.. జియోలో తమ వాటాను పంచుకున్నాయి. తాజాగా మరో విదేశీ కంపెనీ ఇదేబాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది.
జియోలో మరో కంపెనీ పెట్టుబడి పెట్టనుందా?
గత వారమే జియోలో అమెరికాకు చెందిన కేకేఆర్ కంపెనీ రూ. 11,367 కోట్లు మేర పెట్టుబడి పెట్టింది. అంతకుముందు ఫేస్‌బుక్, సిల్వర్ లేక్ పార్టనర్స్, విస్టా ఈక్విటీ పార్టనర్స్, జనరల్ అట్లాంటిక్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. వీటి మొత్తం విలువ రూ. 78,562 కోట్లు. ముబ్దాలా కంపెనీ కూడా జియోలో వాటాలు కొనుగోలు చేస్తే.. ఆరో కంపెనీ కానుంది. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
ఇదీ చదవండి:జియోలో మరో అమెరికన్ కంపెనీ భారీ పెట్టుబడులు
Last Updated : May 29, 2020, 9:59 AM IST