తెలంగాణ

telangana

ETV Bharat / business

Petrol Price: ఆగని పెట్రో బాదుడు- ఎంత పెరిగిందంటే? - నేటి బంగారం ధర

చమురు ధరలు మరోసారి పెరిగాయి. లీటర్​ పెట్రోల్​పై 36 పైసలు, డీజిల్​పై 36 పైసల వరకు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక హైదరాబాద్​, విజయవాడ, వైజాగ్​ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

hike in petrol, diesel rates
పెరిగిన పెట్రోల్ ధరలు

By

Published : Jun 27, 2021, 9:16 AM IST

దేశంలో పెట్రోల్, డీజిల్​ ధరలు ఆదివారం మళ్లీ పెరిగాయి.

  • హైదరాబాద్​లో పెట్రోల్ ధర లీటర్​కు 36 పైసలు పెరిగి.. రూ.102.32 వద్ద ఉంది. డీజిల్ ధర 26 పైసలు పెరిగి రూ.96.89 కి చేరింది.
  • గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.104.67 ఉండగా.. డీజిల్‌ రూ.98.63 కు చేరింది.
  • వైజాగ్​లో పెట్రోల్ ధర లీటర్​ రూ.103.47 వద్ద ఉండగా.. లీటర్​కు​ డీజిల్ ధర రూ.97.47గా ఉంది.

మెట్రో నగరాల్లో పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి..

  • దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 98.52 ఉండగా.. డీజిల్​ రూ. 88.95గా ఉంది.
  • ముంబయిలో లీటరు పెట్రోల్​ ధర రూ. 104.62గా ఉండగా.. డీజిల్​ ధర 96.48కు చేరింది.
  • చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ. 99.55, డీజిల్​ రూ. 93.51గా ఉంది.
  • కోల్​కత్తాలో లీటర్​ పెట్రల్​ ధర రూ. 98.36, డీజిల్​ ధర రూ. 91.80కు చేరింది.

బంగారం ధరలు ఇలా..

హైదరాబాద్​, విజయవాడ, వైజాగ్​ నగరాల్లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.48,640 వద్ద ఉంది. వెండి ధర కిలో రూ.70,520 వద్ద ఉంది.

ABOUT THE AUTHOR

...view details