కొత్తగా వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి ఆగస్టు అనువైన నెలగా మారనుంది. ఎందుకంటే వచ్చే నెల నుంచి ద్విచక్ర వాహనాలు, కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఇప్పటికే విక్రయాలు లేక వాహన రంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే.. ఇప్పుడు ధరలు తగ్గడం ఏమిటి? అనేగా మీ సందేహం!
అయితే నిజానికి వాహనాల ధరలు తగ్గేందుకు అసలు కారణం వాహన తయారీ కంపెనీలు కాదు. సమగ్ర బీమా గడువు తగ్గటం. దీనితో ఆన్‌రోడ్ ధరలు తగ్గనున్నాయి.
వాహన సమగ్ర బీమాకు సంబధించిన కొత్త నిబంధనలకు బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఆగస్టు 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.