ప్రముఖ ఆన్లైన్ క్యాబ్ సేవల సంస్థ ఓలా.. వచ్చే ఏడాది జనవరి నాటికి ఈ-స్కూటర్లను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నెదర్లాండ్స్లో తయారైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత్తో పాటు ఐరోపా దేశాల్లో అమ్మకాలు నిర్వహించనున్నట్టు సమాచారం.
ఈ ఏడాది మేలో ఆమ్స్టర్డామ్- ఎటర్గో బీవీని కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది ఈ క్యాబ్ సేవల సంస్థ. ఆ సమయంలోనే.. 2021లో దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది.