కరోనా ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. ఇప్పటివరకు 10వేలమందికి పైగా వైరస్ బారిన పడి మరణించారు. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టే క్రమంలో ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా.. తమ షేర్ రైడ్లను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.
కోవిడ్-19 ను అరికట్టేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. తదుపరి నోటీసు వచ్చే వరకు ఓలా షేర్ రైడ్లను తాత్కాలికంగా నిలిపేస్తున్నాం.