తెలంగాణ

telangana

ETV Bharat / business

ఓలా ఈ-స్కూటర్​ బుకింగ్, టెస్ట్ రైడ్, డెలివరీ ఇలా...

బుధవారం నుంచే ప్రారంభం కావాల్సిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు ఈ నెల 15కి వాయిదా పడ్డాయి. తొలుత నిర్ణయించిన తేదీకి తమ వెబ్​సైట్ సిద్ధంగా లేదని.. అయితే స్కూటర్ల డెలివరీల తేదీల్లో మాత్రం మార్పు లేదని ప్రకటించింది. అక్టోబర్‌ మొదటి వారంలో డెలివరీ కానున్న ఈ స్కూటర్.. వాహన ప్రేమికుల మనసు గెలుచుకుని తీరుతుందని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. ప్రధానంగా రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనున్న ఈ వాహనాన్ని 'టెస్ట్ రైడ్' చెయొచ్చని తెలిపింది. ఇక అడ్వాన్స్ చెల్లిస్తే నేరుగా హోం డెలివరీ చేయనుంది ఓలా.

Ola E-scooter
Ola E-scooter

By

Published : Sep 8, 2021, 1:55 PM IST

Updated : Sep 9, 2021, 2:49 PM IST

సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభం కావాల్సిన 'ఓలా' ఎలక్ట్రిక్ స్కూటర్(ఈ- స్కూటర్) అమ్మకాలు వాయిదాపడ్డాయి. అనుకున్న సమయానికి తమ వెబ్​సైట్ సిద్ధంగా లేదని.. సెప్టెంబర్ 15 నుంచి స్కూటర్ల అమ్మకాలు మొదలవుతాయని ఓ ప్రకటనలో తెలిపింది. ఆన్​లైన్​లో బుకింగ్ చేసుకున్నవారు త్వరలోనే స్కూటర్​ను అందుకుంటారని సందేశాలు పంపింది. ఈ నేపథ్యంలో ఓలా స్కూటర్ కొనుగోలుపై ఉన్న పలు సందేహాలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా కొనాలి?

ఈ ఏడాది జులైలో రూ.499 చెల్లించి ఓలా వెబ్​సైట్‌లో బుక్ చేసుకున్న వారికి నేరుగా స్కూటర్​ ఇంటికే వస్తుందని ఓలా తెలిపింది. ఇందుకోసం ఎస్ 1 మోడల్​కి రూ.20 వేలు, ఎస్ 1 ప్రోకు గాను రూ.25 వేలు అడ్వాన్స్​​ చెల్లించాల్సి ఉంటుంది.

ఓలా స్కూటర్ ధర ఎంత?

దిల్లీలో ఓలా ఎస్1 ఎక్స్-షోరూమ్ ధర రూ.85,099 కాగా, ఎస్ 1 ప్రో ధర రూ.110,149 గా నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల్లో ధరలు ఉంటాయి.

ఫైనాన్స్​లో కొనాలంటే ఎలా?

ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్​తో పాటు.. పలు ఫైనాన్సింగ్ సంస్థలతో ఓలా ఒప్పందం కుదుర్చుకుంది. ఐడీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంక్(IDFC), హెచ్​డీఎఫ్​సీ(HDFC), టాటా క్యాపిటల్ సంస్థల ద్వారా ఫైనాన్స్ ఏర్పాట్లు చేసింది ఓలా. ఆధార్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్‌లతో సులభంగా లోన్ పొందొచ్చని తెలిపింది. ఒకవేళ ఫైనాన్స్ అవసరం లేకపోతే అడ్వాన్స్ చెల్లింపు పోను ఇన్‌వాయిస్ సమయంలో మిగిలిన మొత్తాన్ని చెల్లించవచ్చు.

వివిధ రంగుల్లో ఆకర్షణీంయంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్

ఈ స్కూటర్​కు బీమా ఎలా?

ఐసీఐసీఐ లాంబార్డ్ సంస్థతో వాహన బీమాను అందిస్తుంది ఓలా.

ఈ స్కూటర్​ను టెస్ట్ రైడ్​ చెయ్యొచ్చా?

వచ్చే నెల నుంచి తన వినియోగదారులకు టెస్ట్ రైడ్ సౌకర్యం కల్పించనున్నట్లు ఓలా ఓ ప్రకటనలో పేర్కొంది. స్కూటర్ పనితీరు పట్ల సంతృప్తి చెందనివారు హోం డెలివరీకి ముందే ఆర్డర్​ను రద్దు చేసుకునే సదుపాయం ఉందని తెలిపింది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ హోమ్ డెలివరీ?

వచ్చే నెల స్కూటర్ డెలివరీ ప్రారంభమవుతుంది. కానీ నేరుగా వినియోగదారుని ఇంటికే డెలివరీ అవుతుందా లేదా అనే దానిపై కంపెనీ కచ్చితమైన తేదీ ప్రకటించలేదు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు

సర్వీసింగ్ ఎలా?

తమ స్కూటర్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత స్మార్ట్ వాహనమని ఓలా ప్రకటించింది. సర్వీసింగ్ అవసరమైనప్పుడు(3-6 నెలలకు) వినియోగదారులకు నోటిఫికేషన్ ఇస్తుందని తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్ యాప్‌లో డోర్ స్టెప్ సర్వీస్​ను బుక్ చేసుకుంటే నేరుగా ఇంటివద్దనే సర్వీసింగ్ సదుపాయం పొందొచ్చు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 9, 2021, 2:49 PM IST

ABOUT THE AUTHOR

...view details