Ola Electric scooters: తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను బుక్ చేసుకున్న వారందరికీ త్వరలోనే వాటిని అందించనున్నట్లు ఓలా సంస్థ ప్రకటించింది. ఈ వాహనాలను కొనుగోలు చేసిన కస్టమర్ల సమీప డెలివరీ కేంద్రాలకు వాటిని డిస్పాచ్ చేసినట్లు ప్రకటనలో పేర్కొంది. అతి త్వరలోనే రెండో విడత బుకింగ్‌ను కూడా ప్రారంభిస్తామని చెప్పింది. ఓలా ఛైర్మన్, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భవిశ్ అగర్వాల్ ఈ మేరకు వెల్లడించారు.
పర్యావరణ హిత ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తయారు చేస్తున్నట్లు ఈ ఏడాది ఆగస్టులో ప్రకటించింది ఓలా. ఎస్ 1, ఎస్ 1 ప్రో పేరుతో రెండు వేరియంట్లలో దీన్ని తీసుకొచ్చింది. ధర రూ.99,999, రూ.1,29,999గా నిర్ణయించింది. కేవలం రూ.499తో అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
అయితే ఈ వాహనాలను అక్టోటర్లోనే డెలివరీ చేస్తామని ఓలా చెప్పినప్పటికీ కరోనా కారణంగా అది నవంబర్‌కు వాయిదాపడింది. ఆ తర్వాత సెమీకండర్ల కొరత ఉందని ఈ-స్కూటర్లను డిసెంబర్ రెండో వారంలో కస్టమర్లకు అందిస్తామని చెప్పింది. ఎట్టకేలకు వాటిని డిస్పాచ్ చేసింది.
ఈ-స్కూటర్ల ఆర్టీఓ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయిందని, ఇది పూర్తిగా డిజిటలైజ్ కావడం వల్ల డెలివరీ అనుకున్న సమయం కంటే ఆలస్యమైందని ఓలా పేర్కొంది.