Ola electric fund raise : ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ విలువ రూ. 37వేల కోట్లకు చేరింది. తాజాగా ఈ సంస్థలోకి సుమారుగా మరో రూ.1,490 కోట్ల పెట్టుబడులు వచ్చి చేరాయి. టెక్నే ప్రైవేట్ వెంచర్స్, ఆల్పైన్ ఆపర్చునిటీ ఫండ్, ఎడెల్‌వీస్ వంటి సంస్థల నుంచి ఓలా 200 మిలియన్ డాలర్లను సేకరించింది. దీంతో మార్కెట్ విలువ రూ. 37 వేల కోట్ల మార్కుకు చేరినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
'ఓలా'కు పెట్టుబడుల వరద- రూ.37వేల కోట్లకు మార్కెట్ వ్యాల్యూ - undefined
Ola electric fund raise : ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తున్న ప్రముఖ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ విలువ రూ. 37 వేల కోట్లకు చేరింది. తాజాగా వివిధ కంపెనీల నుంచి ఓలా సుమారు రూ. 1,490 కోట్లు సమీకరించింది.
ఓలా లోకి మరిన్ని పెట్టుబడులు
గతేడాది సెప్టెంబర్‌లో కూడా ఓలా ఎలక్ట్రిక్ ఇంతే మొత్తంలో నిధులను సమీకరించినట్లు ప్రకటించింది. దీంతో ఫాల్కన్ ఎడ్జ్, సాఫ్ట్‌బ్యాంక్ లాంటి ఇతరులు ఇందులో పెట్టుబడులు పెట్టాయి. దీంతో కంపెనీ ముఖ విలువు అప్పట్లో 3 బిలియన్ డాలర్లకు(సుమారు రూ. 22,272 కోట్లు) చేరుకున్నట్లు ప్రకటించింది.
ఇదీ చూడండి:అద్దె విమానాలపై కొవిడ్ దెబ్బ.. ఎన్నికలున్నా గిరాకీ అంతంతే!
TAGGED:
Ola electric fund raise