తెలంగాణ

telangana

ETV Bharat / business

ఒకాయా కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​- ధర తక్కువే! - okaya freedum scooter price

ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్ సంస్థ ఒకాయా పవర్ గ్రూప్​.. ఫ్రీడమ్ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్​ను(Okaya Electric Scooter) విడుదల చేసింది. నాలుగు వేరియంట్లలో లభించే ఈ స్కూటర్ ధర చాలా తక్కువే అని చెబుతోంది.

okaya electric scooter
ఒకాయా ఎలక్ట్రిక్ స్కూటర్​

By

Published : Sep 16, 2021, 4:16 PM IST

ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్ సంస్థ ఒకాయా పవర్​ గ్రూప్​(Okaya Power Group) మరో ఎలక్ట్రిక్ స్కూటర్​తో(Okaya Electric Scooter) ముందుకొచ్చింది. ఫ్రీడమ్ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ను భారత మార్కెట్లో గురువారం విడుదల చేసింది. ఈ స్కూటర్(Okaya Electric Scooter) ధర రూ.69,900 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే.. ఎవియాన్ ఐక్యూ, క్లాసిక్​ ఐక్యూ పేర్లతో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఒకాయా గ్రూప్​ విక్రయిస్తోంది.

'ఫ్రీడమ్' స్కూటర్​ను లిథియమ్-అయాన్​, లెడ్​-యాసిడ్​ బ్యాటరీలతో తీసుకువచ్చినట్లు ఒకాయా గ్రూప్ వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్​లోని తమ ఉత్పత్తి కేంద్రంలో వీటిని తయారు చేస్తున్నట్లు చెప్పింది. నాలుగు వేరియంట్లలో లభ్యమయ్యే స్కూటర్లను ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించవవచ్చని పేర్కొంది.

"భవిష్యత్​ అంతా విద్యుత్​ వాహనాలదే. అందుకే ఉత్తమమైన నాణ్యతతో ప్రతి భారతీయుడి డబ్బులకు న్యాయం చేసేలా.. వాహనాలను మేం తీసుకువస్తున్నాం. మా అనుబంధ వ్యాపారాల కారణంగా.. మార్కెట్లో మాకు మంచి ఆదరణ ఉండడం సహజమే."

-అనిల్ గుప్తా, ఒకాయా పవర్ గ్రూప్​ మేనేజింగ్​ డైరెక్టర్​

హైస్పీడ్​ మోటార్ సైకిల్ సహా మరో 14 కొత్త వాహనాలను తీసుకురానున్నట్లు ఒకాయా గ్రూప్​ వెల్లడించింది. స్పెషలైజ్డ్​ బీ2బీ వాహనాలను తీసుకువస్తామని తెలిపింది. ప్రస్తుతం తమకు 120 మంది డీలర్లు ఉండగా.. భవిష్యత్తులో ఈ సంఖ్యను 800కు పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పింది.

ఇదీ చూడండి:'ఓలా' గ్రాండ్​ ఎంట్రీ- సెకనుకు 4 స్కూటర్ల అమ్మకం

ABOUT THE AUTHOR

...view details