దేశంలో ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్ ధరను లీటరుకు 26 పైసలు, డీజిల్‌ను లీటర్‌కు 34 పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
దేశంలో మళ్లీ పెరిగిన ఇంధన ధరలు
దేశంలో మళ్లీ పెరిగిన ఇంధన ధరలు
08:07 May 10
కొనసాగుతున్న పెట్రో మంట
తాజా బాదుడుతో దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.91.53కి చేరగా.. లీటరు డీజిల్ ధర రూ.82.06కి పెరిగింది.
ఇతర నగరాల్లో
మరోవైపు, ముంబయిలో పెట్రోల్ ధర వంద రూపాయలకు చేరువవుతోంది. ప్రస్తుతం లీటరు ధర రూ.97.86గా ఉంది. డీజిల్ ధర రూ.89.17కి చేరింది. చెన్నైలో లీటరు ధర రూ.93.38 ఉండగా.. డీజిల్ రూ.86.96కి చేరింది. కోల్‌కతాలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా... రూ.91.66, రూ.89.17గా ఉన్నాయి.
Last Updated : May 10, 2021, 8:27 AM IST