అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. ఏకంగా 25 శాతానికి పైగా దిగజారాయి. ఇంధన ఉత్పత్తి విషయంలో రష్యా, సౌదీ అరేబియా మధ్య విభేదాలు తలెత్తడమే దీనికి కారణం. బ్రెంట్ క్రూడ్ ధర 26శాతం కుంగి బ్యారెల్ 33.66 డాలర్లకు చేరగా.. డబ్ల్యూటీఐ 27 శాతం నష్టపోయి బ్యారెల్ 30.35 డాలర్లకు చేరింది. 1991 గల్ఫ్ యుద్ధం తర్వాత ముడి చమురు ధరలు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి.
భారీగా పతనమైన చమురు ధరలు - చమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు సోమవారం ఏకంగా 25 శాతం పతనాన్ని చవిచూశాయి. ఇంధన ఉత్పత్తుల విషయంలో రష్యా, సౌదీ అరేబియా మధ్య విభేదాలు తలెత్తడం వల్ల చమురు ధరలను సౌదీ భారీగా తగ్గించటమే ఇందుకు కారణం.
కరోనావైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు డిమాండ్ భారీగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్ దేశాలు), రష్యా మధ్య ఇంధన ఉత్పత్తి తగ్గించాలన్న అంశంపై చర్చలు జరిగాయి. కానీ, అవి విఫలం కావడంతో సౌదీఅరేబియా గతవారం చమురు ధరలు భారీగా తగ్గించింది. ఎక్కువ మార్కెట్‌ను ఒడిసిపట్టాలన్న వ్యూహంతోనే సౌదీ ఈ చర్యలకు ఉపక్రమించింది. రానున్న రోజుల్లో సౌదీ చమురు శుద్ధి సంస్థ ఆరామ్‌కో ఉత్పత్తిని మరింత పెంచే అవకాశం ఉందని సమాచారం. ఇదే జరిగితే చమురు ధరలు మరింత కిందకి రావడం ఖాయం.
ఇదీ చూడండి:ఈక్విటీల్లోనే 82% మంది మహిళల పెట్టుబడులు