వంటింట్లో గ్యాస్ మంట- భారీగా పెరిగిన సిలిండర్ ధర - వంట గ్యాస్ ధర
07:36 March 22
వంటింట్లో గ్యాస్ మంట- భారీగా పెరిగిన ధర
Cylinder price: వంటింట్లో గ్యాస్ బండ సామాన్యుల గుండెల్లో గుదిబండలా మారింది. ఓవైపు పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు మోత మోగుతుంటే.. వంట గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 14 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.50 పెంచాయి. పెంచిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి . దీంతో హైదరాబాద్‌లో 14 కేజీల సిలిండర్ ధర రూ.1002కి చేరింది. అటు దేశంలో ఇంధన ధరలు కూడా పెరిగాయి.
LPG cylinder price in Hyderabad
ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగింపు, ఉక్రెయిన్‌లో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో చమురు సంస్థలు ధరలు పెంచినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.