కెనడాలో కొవాగ్జిన్(Covaxin) పంపిణీకి భారత్ బయోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఆక్యుజెన్ ఇంక్... ఇందుకోసం 15మిలియన్ డాలర్ల(రూ.109.23 కోట్లు)ను చెల్లించింది. కెనడాలో కొవాగ్జిన్ పంపిణీ ప్రారంభమైన నెల రోజుల్లోగా మరో 10మిలియన్ డాలర్లను చెల్లించనున్నట్లు ఆక్యుజెన్ తెలిపింది.
కెనడా మార్కెట్లో కొవాగ్జిన్ పంపిణీపై ఈ నెల జూన్ 3న రెండు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అమెరికా మార్కెట్‌కు సంబంధించి వీరి మధ్య ఇప్పటికే ఒప్పందం ఉంది.