తెలంగాణ

telangana

By

Published : Jun 3, 2021, 5:21 PM IST

ETV Bharat / business

2025 నాటికి 90 కోట్లకు ఇంటర్నెట్ యూజర్లు!

2025 నాటికి దేశంలో యాక్టివ్ ఇంటర్నెంట్ యూజర్లు పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటారని ఓ నివేదిక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆ సమయానికి దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 90 కోట్లపైకి చేరొచ్చని అంచనా వేసింది. నివేదిక తెలిపిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

Internet users Growing in India
పెరుగుతున్న ఇంటర్నెట్ యూజర్లు

దేశంలో 2025 నాటికి క్రియాశీల ఇంటర్నెట్ యూజర్లు 45 శాతం పెరిగి 90 కోట్ల పైకి చేరొచ్చని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా-కాంతర్ క్యూబ్​ నివేదిక అంచనా వేసింది. ఈ సంఖ్య గత ఏడాది 62.2 కోట్లుగా ఉన్నట్లు వివరించింది.

నివేదికలోని ముఖ్యాంశాలు..

  • పట్టణ ప్రాంతాల్లోకన్నా.. గ్రామీణ ప్రాంతాల్లోనే 2025 నాటికి ఇంటర్నెట్ యూజర్లు అధికంగా ఉండొచ్చు.
  • గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య దేశంలో డిజిటల్ పర్యవరణాన్ని మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.
  • వార్షిక ప్రాతిపదికన కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య అధికంగా పెరుగుతోంది.
  • 2020లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య పట్టణ ప్రాంతాల్లో 4 శాతం పెరిగి.. 32.3 కోట్లకు చేరింది.
  • గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్​ యూజర్ల వృద్ధి 2020లో 13 శాతంగా ఉంది. గత ఏడాది నాటికి ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 29.9 కోట్లు.
  • పట్టణ ప్రాంతాల క్రియాశీల ఇంటర్నెట్ యూజర్లలో 33 శాతం వాటా 9 ప్రధాన మెట్రో నగరాలదే.

ఇదీ చదవండి:'నాలుగేళ్లలో ఆయుష్మాన్ భారత్​కు 7% నిధులే'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details