తెలంగాణ

telangana

ETV Bharat / business

వంట గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు... కానీ...

వంట గ్యాస్​ ధర భారీగా పెరిగింది. ఒక్కో సిలిండర్​పై రూ.144.5 పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​ సంస్థ. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అయితే... సామాన్యులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తిరిగి ఇచ్చే రాయితీ సొమ్మును రెట్టింపు చేసింది.

LPG prices hiked up to Rs 144 per cylinder
పెరిగిన సబ్సిడీయేతర ఎల్​పీజీ సిలిండర్ ధరలు

By

Published : Feb 12, 2020, 1:31 PM IST

Updated : Mar 1, 2020, 2:12 AM IST

వంట గ్యాస్​ సిలిండర్ల ధర భారీగా పెరిగింది. ఒక్కో సిలిండర్​పై రూ.144.5(దిల్లీలో) పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగ ఇంధన సరఫరా సంస్థ ఇండియన్ ఆయిల్ ప్రకటించింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్​లో ఇంధన ధరల పెరుగుదలే ఇందుకు కారణమని తెలిపింది.

అయితే... ఈ పెంపు నుంచి సామాన్య వినియోగదారులకు ఊరట కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఒక్కో సిలిండర్​పై ఇచ్చే రాయితీని రూ.153.86 నుంచి రూ.291.48కి పెంచింది. ఈ మొత్తం సొమ్ము నేరుగా వినియోగదారుల ఖాతాలో జమకానుంది.

ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన (పీఎమ్​యూఎల్​) లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్​పై ఇస్తున్న రాయితీ రూ.174.86 నుంచి రూ.312.48కి పెరిగింది. దీని ప్రకారం 14.2 కిలోల సిలిండర్​... గృహ వినియోగదారులకు రూ.567.02, పీఎమ్​యూఎల్ వినియోగదారులకు రూ.546.02కు లభిస్తుంది.

వివిధ నగరాల్లో తాజా ధరలు:

దిల్లీ - రూ.858.50 (రూ.144.50 పెంపు)

కోల్​కతా - రూ.896 (రూ.149 పెంపు)

ముంబయి - రూ.829.50 (రూ.145 పెంపు)

చెన్నై - రూ.881 (రూ.147 పెంపు)

2020లో తొలిసారి...

ఇండియన్​ ఆయిల్ దేశంలో అతిపెద్ద ఇంధన రిటైలర్. ఇది ఇండేన్ బ్రాండ్ కింద ఎల్​జీపీని సరఫరా చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎల్​పీజీ ధరలు పెంచని సంస్థ.. ఇప్పుడు సిలిండర్ల రేట్లలో భారీ మార్పులు చేసింది.

2014లో వంటగ్యాస్​ సిలిండర్​ ధర సుమారు రూ.200 వరకు పెరిగి రూ.1,241 వరకు చేరుకుంది. దాని తరువాత మళ్లీ ఇంతలా రేట్లు పెరగడం ఇదే మొదటిసారి. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల వల్లే ఎల్​పీజీ ధరల పెంపు కొంచెం ఆలస్యమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అంతా డీబీటీ...

ప్రస్తుతం దేశంలోని ఎల్​పీజీ వినియోగదారులు అందరూ సిలిండర్​ను మార్కెట్​ ధరలకు కొనుగోలు చేయాలి. అయితే గృహ అవసరాల కోసం... ఒక్కో ఇంటికి సంవత్సరానికి 12 సిలిండర్లను రాయితీపై అందిస్తోంది ప్రభుత్వం. ఈ రాయితీ మొత్తాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) ద్వారా నేరుగా వినియోగదారుల ఖాతాల్లోనే జమ చేస్తోంది. ప్రభుత్వం ఇస్తున్న రాయితీ మొత్తం... అంతర్జాతీయ బెంచ్​మార్క్ ఎల్​పీజీ రేటు, విదేశీ మారక రేటులో వచ్చిన మార్పులపై ఆధారపడి ఉంటుంది.

ఇదీ చూడండి:షియోమీ బడ్జెట్ ఫోన్​: ​రెడ్​మీ 8ఏలో మరిన్ని ఫీచర్లు

Last Updated : Mar 1, 2020, 2:12 AM IST

ABOUT THE AUTHOR

...view details