తెలంగాణ

telangana

ETV Bharat / business

గుడ్​ న్యూస్..​ భారీగా తగ్గిన వంటగ్యాస్ ధర - వంటగ్యాస్ ధర భారీగా తగ్గింపు

వంటగ్యాస్ ధరలు భారీగా తగ్గించాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. అంతర్జాతీయంగా బెంచ్​మార్క్ రేట్లకు అనుగుణంగా రాయితీ లేని సిలిండర్​పై రూ.162.50 తగ్గించినట్లు తెలిపాయి.

cooking gas price cut
భారీగా తగ్గిన వంటగ్యాస్ ధరలు

By

Published : May 1, 2020, 3:12 PM IST

వరుసగా మూడో నెలలోనూ రాయితీ లేని వంట గ్యాస్​ ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమైన వేళ దేశీయంగా 14.2 కిలోల రాయితీ లేని సిలిండర్ ధర రికార్డు స్థాయిలో రూ.162.50 తగ్గించాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.

తాజా తగ్గింపుతో 14.2 కిలోల సిలిండర్ ధర (దిల్లీలో) రూ .581.50కు చేరింది. గురువారం వరకు దీని ధర రూ.744గా ఉంది.

హోటళ్లు, ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండరు ధర కూడా రూ.1,285 నుంచి రూ.1,029కి తగ్గింది.

అంతర్జాతీయ బెంచ్​మార్క్ రేట్లకు అనుగుణంగా దేశీయంగా ప్రతి నెల ధరలను సవరిస్తుంటాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.

ధరల తగ్గుదల ఎందుకు?

కరోనా కారణంగా అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు డిమాండ్ భారీగా తగ్గింది. ఫలితంగా ధరలు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. ఈ కారణంగానే దేశీయంగా ధరల్లో క్షీణత నమోదైంది.

ఇదీ చూడండి:'ఆటో'పై కరోనా దెబ్బ- ఏప్రిల్​లో విక్రయాలు జీరో

ABOUT THE AUTHOR

...view details