అంతర్జాతీయంగా ముడిచమురు డిమాండ్‌పై కరోనా వైరస్ ప్రభావంతో దేశీయంగా ఇంధన ధరలు తగ్గుతున్నాయి. కొన్ని నెలల విరామం తర్వాత విమానాల ఇంధన ధరలు 10.3 శాతం పడిపోయాయి.
దిల్లీలో విమానయాన టర్బైన్ ఇంధనం(ఏటీఎఫ్) ధర కిలోలీటర్‌కు రూ.6,590.62 తగ్గి.. రూ.56,859కు చేరుకుంది.
వంటగ్యాస్‌పై..
రాయితీ లేని వంటగ్యాస్ ధర రూ.53 తగ్గింది. 14.2 కేజీల సిలిండర్ ధర రూ.858.5 నుంచి రూ.805.5కు పడిపోయింది.
దేశీయ ఎల్పీజీ వినియోగదారులకు ఏటా 12 సిలిండర్లను రాయితీపై అందిస్తోంది ప్రభుత్వం. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రూ.50 మేర తగ్గి రూ.240కు చేరుకుంది.
వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు కూడా రూ.1,466 నుంచి 1,381.5కు పడిపోయాయి.
ఇదీ చూడండి:భారత్‌లో ఐఫోన్ మరింత ప్రియం- పెరిగిన ధరలివే..