ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ నోకియా ఇండియా.. 5జీ ట్రయల్స్‌పై(5g trials in india) కీలక ప్రకటన చేసింది. వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ ఉపయోగించి చేసిన ట్రయల్స్‌లో.. అత్యధికంగా 9.85 జీబీపీఎస్ వేగాన్ని(5g trial speed) నమోదు చేసినట్లు పేర్కొంది. ఈ ట్రయల్స్‌లో తమ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం వల్ల రికార్డు స్థాయి వేగాన్ని అందుకున్నట్లు నోకియా తెలిపింది. గుజరాత్ గాంధీనగర్‌లో ఈ ట్రయల్స్ నిర్వహించినట్లు వివరించింది.
"వొడాఫోన్ ఐడియాతో కలిసి.. 80 హెర్జ్ స్పెక్ట్రమ్‌లో 'ఈ-బ్యాండ్' మైక్రోవేవ్‌ను ఉపయోగించి 9.85 జీబీపీఎస్ వేగాన్ని సాధించాం. దీంతో 5జీ సేవలు అందించే సామర్థ్యాన్ని సంపాదించినట్లు భావిస్తున్నాం. ఫైబర్ నెట్‌వర్క్ సేవలు అందించేందుకు ఇబ్బందులు ఉండే ప్రాంతాల్లో ఈ-బ్యాండ్ ద్వారా 5జీ సేవలను అందించవచ్చు. ఈ ట్రయల్స్‌లో వొడాఫోన్ ఐడియాతో భాగస్వామిగా ఉన్నందుకు ఆనందంగా ఉంది" అని నోకియా ఇండియా ట్విట్టర్ వేదికగా తెలిపింది.
బ్యాక్ ఎండ్‌లో మొబైల్ నెట్‌వర్క్‌లను కలిపేందుకు 'ఈ-బ్యాండ్' ఉపయోగపడుతుంది. ఆప్టికల్ ఫైబర్ స్థాయిలో డేటాను రవాణా చేయగలుగుతుంది.