టాటా గ్రూప్‌లో కార్యనిర్వాహక (ఎగ్జిక్యూటివ్) పదవుల నుంచి నోయల్ టాటా (Tata News) నిష్క్రమించారు. అయితే ట్రెంట్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్ప్, వోల్టాస్, టాటా ఇంటర్నేషనల్‌లలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతారు. టైటన్‌కు వైస్ ఛైర్మన్‌గానూ ఉంటారు. టాటా గ్రూప్‌లో ఎగ్జిక్యూటివ్ బాధ్యతలకు నోయల్ ఈ నెల మొదట్లో స్వస్తి చెప్పారు. 65 ఏళ్లు నిండిన నేపథ్యంలో, సీనియర్ అధికారులకు ఉన్న పదవీ విరమణ విధానం కింద టాటా ఇంటర్నేషనల్ ఎండీ బాధ్యతల నుంచీ (Tata News) తప్పుకున్నారు. టాటా గ్రూప్ విధానం ప్రకారం.. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవులను 65 ఏళ్ల వయసులో, అన్ని బోర్డు పదవులను 70 ఏళ్ల వయసులో వదులుకోవాల్సి ఉంటుంది.
ట్రెంట్ రాణింపు వెనక..
నమోదిత సంస్థ అయిన ట్రెంట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గ్రూప్ రిటైల్ సంస్థలైన వెస్ట్‌సైడ్, జుడియో, స్టార్‌బజార్ ఫ్రాంచైజీలను (Tata News) నోయల్ టాటాయే విస్తరించారు. స్పెయిన్ రిటైలర్ ఇండిటెక్స్ ఆధ్వర్యంలోని జారా, మాసిమో దత్తి వంటి సంస్థలతో సంయుక్త కంపెనీలను ఏర్పాటు చేయడంలోనూ నోయల్ కీలక పాత్ర పోషించారు. ట్రెంట్‌కు ఎండీగా నోయల్ (Tata News) బాధ్యతలు స్వీకరించాక, ఆ కంపెనీ మార్కెట్ విలువ రూ.3600 కోట్ల (2014లో) నుంచి ఇపుడు రూ.40,000 కోట్లకు చేరింది. అతిపెద్ద రిటైలింగ్ సంస్థ కాకున్నా, లాభాల్లో ఉన్న అతికొద్ది సంస్థల్లో ఒకటిగా నిలిపారు. వోల్టాస్ పగ్గాలు చేపట్టాక ఆ కంపెనీ మార్కెట్ విలువ రూ.18,000 కోట్ల (2000లో) నుంచి ప్రస్తుతం రూ.40,000 కోట్లకు పైగా చేరింది. బృందాన్ని వెనక నుంచి నడిపించడమే నోయల్‌కు అలవాటు అని అధికార వర్గాలు అంటున్నాయి. ఎగ్జిక్యూటివ్ పదవుల నుంచి వైదొలగినా.. ఆయన 'టాటా' అన్న సంగతి గుర్తుంచుకోవాలని.. భవిష్యత్‌లోనూ గ్రూప్‌తో ఆయన అనుబంధం కొనసాగుతుందని కంపెనీ వర్గాలు అంటున్నాయి.
ఇదీ చూడండి :రిలయన్స్ జియోకు తగ్గారు- ఎయిర్‌టెల్‌కు పెరిగారు!