తెలంగాణ

telangana

ETV Bharat / business

'కోచింగ్ కేంద్రాల్లో ఫీజులపై జీఎస్టీ చెల్లించాల్సిందే' - కోచింగ్ సెంటర్ ఫీజులపై జీఎస్టీ

కోచింగ్ కేంద్రాల్లో ఫీజులపై 18 శాతం జీఎస్టీ మినహాయింపు ఇవ్వలేమని అథారిటీ ఫర్ అడ్వాన్స్​ రూలింగ్ ఆంధ్రప్రదేశ్ ధర్మాసనం స్పష్టం చేసింది. వీటిని చట్టం ప్రకారం విద్యాసంస్థలుగా గుర్తించలేమని తీర్పునిచ్చింది.

coaching class fees
మాస్టర్​ మైండ్స్

By

Published : Aug 11, 2020, 6:48 AM IST

శిక్షణా కేంద్రాల్లో విద్యార్థులు ఫీజులపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందేనని అథారిటీ ఫర్ అడ్వాన్స్​ రూలింగ్​(ఏఏఆర్​) ఆంధ్రప్రదేశ్​ ధర్మాసనం తీర్పునిచ్చింది. కోర్సు ఫీజులు, వసతి, మెస్​ ఛార్జీలకు సంబంధించి ఎలాంటి మినహాయింపులకు అర్హులు కారని స్పష్టం చేసింది.

గుంటూర్​కు చెందిన మాస్టర్​ మైండ్స్ అనే శిక్షణ సంస్థ దాఖలు చేసిన పిటిషన్​పై విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఇటువంటి శిక్షణా సంస్థలకు సంబంధించిన విద్యా సేవలకు పన్ను మినహాయింపు ఉండవని తెలిపింది.

"సీఏ, ఐసీఏఐ, ఐసీడబ్ల్యూఏఐ వంటి కోర్సుల్లో ధ్రువపత్రాల కోసం శిక్షణా కేంద్రాల్లో చదవటం తప్పనిసరి కాదు. పరీక్షలను సులభతరంగా ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసుకున్నవే ఈ కోచింగ్ సెంటర్లు. వీటిల్లో శిక్షణ పొందినంత మాత్రాన చట్ట ప్రకారం అర్హత, ధ్రువపత్రాలు మంజూరు చేయలేరు."

- ఏఏఆర్ ధర్మాసనం

గుర్తింపు ఇవ్వలేం..

అంతేకాకుండా ఇలాంటి సంస్థల్లో ఏకరూప విధానం ఉండదని, భిన్న రకాల కోర్సులతో వివిధ రకాల ఫీజులు వసూలు చేస్తారని వ్యాఖ్యానించింది ధర్మాసనం. అందువల్ల ఇటువంటి కోచింగ్ కేంద్రాలకు విద్యాసంస్థలుగా గుర్తింపు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా గతంలో తీర్పులను ప్రస్తావించింది ఏఏఆర్. 2018లో మహారాష్ట్ర ఏఏఆర్ ధర్మాసనం ప్రైవేటు కోచింగ్ కేంద్రాల ఫీజులపై మినహాయింపు ఇచ్చేందుకు నిరాకరించిందని గుర్తు చేసింది.

వీటికే మినహాయింపులు..

ప్రస్తుత పన్ను విధానం ప్రకారం ప్రధాన విద్యా సేవలకు మినహాయింపులు ఇచ్చింది. ప్రీ- స్కూల్​ నుంచి ఉన్నత మాధ్యమిక విద్య, చట్టం ద్వారా అర్హత పొందిన కోర్సులు, వృత్తివిద్యా కోర్సులకు ఈ మినహాయింపులు వర్తిస్తాయి. మిగతా విద్యా సేవలతో సహా మెస్​, మరమ్మతులు, నిర్వహణకు 18 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది.

లక్షల్లో ఫీజులు..

గతేడాది ప్రముఖ శిక్షణా కేంద్రాల ప్రతినిధులు 18 శాతం జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు. లేదా కనీసం అతితక్కువ స్లాబ్​ అయినా కేటాయించాలని కోరారు. దీని వల్ల లక్షల్లో ఫీజులు చెల్లిస్తోన్న చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఊరట కలుగుతుందని తెలిపారు.

దేశవ్యాప్తంగా గేట్​, నీట్, జేఈఈ, సివిల్ సర్వీసెస్​ వంటి పోటీ పరీక్షలకు సుమారు 50 లక్షల మంది హాజరవుతారని అంచనా. వీరిలో సగం మంది సన్నద్ధత కోసం కోచింగ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నవారే కావటం గమనార్హం.

ఇదీ చూడండి:షియోమీకి షాక్- అగ్రస్థానానికి శాంసంగ్​

ABOUT THE AUTHOR

...view details