Bitcoin News India Government : బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించేందుకు ఎలాంటి ప్రతిపాదన కేంద్రం వద్ద లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో స్పష్టం చేశారు. ఈ మేరకు పార్లమెంటుకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన ఆర్థిక మంత్రి.. బిట్‌కాయిన్ లావాదేవీలకు చెందిన డేటాను ప్రభుత్వం సేకరించడంలేదన్నారు.
అయితే ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ బిల్లును (cryptocurrency bill india) ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. బిట్‌కాయిన్ లావాదేవీల (bitcoin news latest) నియంత్రణ కోసం రెగ్యులేటరీ వ్యవస్థ తీసుకురావాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆర్బీఐ (bitcoin rbi news) గుర్తింపు పొందిన అధికారిక డిజిటల్ కరెన్సీకి ఈ బిల్లు ద్వారా గుర్తింపునిస్తూ... కొన్ని ప్రైవేటు క్రిప్టో కరెన్సీలపై దేశంలో నిషేధం విధించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
పెట్రోల్, డీజిల్‌పై వరుసగా 5, 10 రూపాయలను కేంద్రం తగ్గించిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. ఇదే విధంగా రాష్ట్రాలు కూడా తమ వ్యాట్‌ను తగ్గిస్తే ఇంధన ధరలు దిగివస్తాయని లోక్‌సభలో అన్నారు. అటు ఏప్రిల్ -సెప్టెంబర్ త్రైమాసికంలో అన్ని మంత్రిత్వశాఖల పరిధిలో రూ.2.29 లక్షల కోట్ల మూలధన వ్యయం కింద ఖర్చు చేసినట్లు ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు నిర్మల బదులిచ్చారు.