తెలంగాణ

telangana

ETV Bharat / business

క్రెడిట్​ కార్డ్​పై పెట్రోల్​ రాయితీ ఇక కట్​

క్రెడిట్ కార్డుతో పెట్రోల్ కొనుగోలు చేసే వాహనదారులకు చేదువార్త అందించాయి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు. ఇప్పటి వరకు క్రెడిట్ కార్డు చెల్లింపులపై ఇస్తున్న 0.75 శాతం తగ్గింపును అక్టోబర్ 1 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. అయితే డెబిట్​, ఈ-వాలెట్​ల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్ కొనసాగుతుందని స్పష్టం చేశాయి.

క్రెడిట్​ కార్డ్​పై పెట్రోల్​ రాయితీ ఇక కట్​

By

Published : Sep 25, 2019, 8:33 PM IST

Updated : Oct 2, 2019, 12:28 AM IST

క్రెడిట్​కార్డుతో పెట్రోల్​ కొనుగోలుపై ఇప్పటి వరకు అందిస్తున్న రాయితీని నిలిపివేయాలని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయించాయి. అక్టోబర్​ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేశాయి.

2016లో నోట్లరద్దు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని సంకల్పించింది. అందుకోసం క్రెడిట్​ కార్డుతో చెల్లింపులు చేసే వారికి పెట్రోల్​ ధరలో 0.75 శాతం డిస్కౌంట్​ అందించాలని ప్రభుత్వ రంగ చమురు సంస్థలను కోరింది.

ఇందుకు ఇండియన్​ ఆయిల్​కార్ప్ (ఐఓసీ), భారత్​ పెట్రోలియం కార్పొరేషన్​ లిమిటెడ్ (బీపీసీఎల్​), హిందుస్థాన్​ పెట్రోలియం కార్పొరేషన్​ లిమిటెడ్​ (హెచ్​పీసీఎల్​)​ అంగీకరించాయి. ఫలితంగా నగదు తగ్గింపుతో పాటు, మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్​) భారాన్ని కూడా ఈ సంస్థలే భరించాల్సి వస్తోంది.

ఈ మూడు చమురు సంస్థలు ఈ-పేమెంట్​ డిస్కౌంట్​, ఎండీఆర్ కింద బ్యాంకులకు... 2017-18 సంవత్సరంలో రూ.1,431 కోట్లు, 2018-19లో దాదాపు రూ.2 వేల కోట్లు చెల్లించాయి. అందుకే ఈ పెను భారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయానికి వచ్చాయి. అక్టోబర్​ 1 నుంచి క్రెడిట్​ కార్డు చెల్లింపులపై రాయితీ ఎత్తివేస్తున్నామని ప్రకటించాయి.

అయితే డెబిట్ కార్డులు, ఈ- వాలెట్​ ద్వారా చెల్లింపులు చేసేవారికి మాత్రం రాయితీ కొనసాగుతుందని చమురు సంస్థలు స్పష్టం చేశాయి.

ఇదీ చూడండి: సంపన్నుల్లో మళ్లీ అంబానీ​ టాప్- ఆస్తి ఎంతంటే...

Last Updated : Oct 2, 2019, 12:28 AM IST

ABOUT THE AUTHOR

...view details