తెలంగాణ

telangana

ETV Bharat / business

తొలినాళ్లలో ఉద్యోగం కోసం మస్క్​ తిప్పలు! - ఎలాన్​ మస్క్ వైరల్​ న్యూస్​ ట్విట్టర్

వినూత్న ఆలోచనలతో అంతర్జాతీయ సంస్థలను స్థాపించి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఎలాన్ మస్క్​కి.. కెరీర్​ ప్రారంభంలో ఒక్క ఉద్యోగం కూడా దొరకలేదంటే నమ్మగలమా? 1995లో ఒక ఇంటర్​నెట్ కంపెనీలో మస్క్​ ఉద్యోగం పొందలేకపోయిన విషయం ప్రస్తుతం ట్విట్టర్​లో వైరల్​గా మారింది.

Elon Musk
ఎలాన్ మస్క్

By

Published : Apr 22, 2021, 9:18 AM IST

ట్విట్టర్‌లో బాగా ప్రాచుర్యం పొందిన వ్యక్తుల్లో ఎలాన్ మస్క్ ఒకరు. ఆయన తరచుగా చేసే చిన్న చిన్న ట్వీట్లు తెగ వైరల్ అవుతుంటాయి. ఈ తరహాలోనే తొలినాళ్లలో ఉద్యోగం కోసం ప్రయత్నించిన విషయంపై మస్క్​ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్​గా మారింది.

ప్రణయ్​ ట్వీట్​..

1995లో ఎలాన్​ మస్క్ ఒక ఇంటర్​నెట్ కంపెనీలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడని మస్క్​ సహచరుడు ప్రణయ్ పాథోల్ ట్వీట్ చేశారు. ఇందుకోసం రెజ్యుమే​ను పంపినప్పటికీ ఆయన తిరస్కరణకు గురయ్యాడని ప్రణయ్​ తెలిపారు. మస్క్ ఎవరితోనైనా మాట్లాడటానికి చాలా సిగ్గుపడేవాడని.. అందువల్ల ఆయనకు ఎక్కడా ఉద్యోగం లభించలేదని రాసుకొచ్చారు. దీంతో సొంతంగా జిప్-2 అనే ఇంటర్​నెట్ సంస్థను స్థాపించినట్లు వివరించారు. తాను సైతం ఎక్కడా ఉద్యోగం పొందలేకపోవడం వల్ల జిప్-2లో భాగమయ్యానని పాథోల్ పేర్కొన్నారు. అయితే ప్రణయ్​ పాథోల్ ట్వీట్​పై ఎలాన్​ మస్క్​ స్పందించారు. "నేను ఉద్యోగం పొందగలను, ఇంటర్నెట్ కంపెనీలోనే కాదు" అని బదులిచ్చారు. మస్క్​ చేసిన ఈ ట్వీట్ కొన్ని గంటల్లోనే వైరల్​గా మారింది. లైకులు, రీట్వీట్లు వెల్లువెత్తాయి.

ఎలాన్ మస్క్ ట్వీట్​

జిప్-2 అనేది వార్తా పత్రికలకు ఆన్‌లైన్ సిటీ గైడ్​ను అందించే సాఫ్ట్​వేర్‌ సంస్థ. గ్లోబల్ లింక్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్‌గా 1995లో ఎలాన్ మస్క్, అతని సోదరుడు కింబల్ మస్క్ గ్రెగ్ కౌరితో కలిసి కాలిఫోర్నియాలో స్థాపించారు. అనంతరం 1999లో దీనిని కాంపాక్ కంప్యూటర్‌కు అమ్మేశారు. మొత్తంగా జిప్-2తో తన కెరీర్​ ప్రారంభించిన మస్క్.. టెస్లా, పేపాల్, స్పేస్ఎక్స్ వంటి సంస్థలను ఇప్పుడు విజయవంతంగా నడిపిస్తున్నారు. అపర కుబేరుడిగా ఎదిగారు.

ఇవీ చదవండి:అదే నిజమైతే టెస్లాను మూసేస్తా: మస్క్‌

'బిట్​కాయిన్​తోనూ టెస్లా కారు కొనొచ్చు'

మస్క్ సంపద ఒక్కరోజే రూ.1.8 లక్షల కోట్లు వృద్ధి

ABOUT THE AUTHOR

...view details