కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం తొలిసారిఆర్‌బీఐకేంద్ర బోర్డు సభ్యులతో సోమవారం భేటీ కానున్నారు. ఆర్థిక స్థిరత్వానికి ప్రభుత్వం తీసుకున్న విధానాలతో పాటు బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన కీలక అంశాలను వారితో చర్చించనున్నారు నిర్మలా.
ఆర్బీఐ సభ్యులతో నేడు నిర్మలా సీతారామన్ భేటీ - భేటీలో ముఖ్యాంశాలు...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బోర్డు సభ్యులతో సమావేశం కానున్నారు. బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన కీలక అంశాలు సహా ఆర్థిక క్రమశిక్షణ కోసం ప్రభుత్వ మార్గదర్శకాలను ఆమె అధికారులకు వివరించనున్నారు.
ఆర్బీఐ సభ్యులతో నేడు నిర్మలా సీతరామన్ భేటీ
భేటీలో ముఖ్యాంశాలు...
- ప్రభుత్వ రంగ బ్యాంకులకు భరోసా, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను ఆర్‌బీఐ పర్యవేక్షణలోకి తీసుకురావడం.
- 2025 నాటికి దేశాన్ని 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం.
- విమానయానం, బీమా, మీడియా రంగాల్లో విదేశీ పెట్టుబడులకు అనుమతులు.
- ఈ ఏడాది ఆర్‌బీఐ నుంచి రూ.90 వేల కోట్లు డివిడెండు రూపంలో ఆశిస్తున్నట్టు ఆమె బడ్జెట్‌లో ప్రకటించారు. దాని కోసం ఆర్‌బీఐతో ఈ చర్చలు ప్రధానం కానున్నాయి. ఈ నిధులకు కేంద్ర బ్యాంకు అంగీకరిస్తే ఇప్పటివరకు కేంద్రం అందుకున్న అత్యధిక డివిడెండ్‌గా రికార్డు సృష్టించనుంది. గతేడాది ఇచ్చిన రూ.68 వేల కోట్లకు ఇవి 32 శాతం అదనం.
2021 నాటికి ద్రవ్యలోటును జీడీపీలో 3 శాతానికి కట్టడి చేయాలని ఆర్థికశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాథమిక లోటును (కేంద్రం చెల్లించాల్సిన వడ్డీలను ద్రవ్యలోటు నుంచి మినహాయిస్తే) పూర్తిగా తొలగించే అంశాలపై కార్యచరణ తయారుచేసేందుకు ఈ సమావేశం కీలకం కానుంది.