ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ బడ్జెట్ అనంతర సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం (ఫిబ్రవరి 16న) ప్రసంగించనున్నారు. ఇందులో బడ్జెట్ 2021-22 ముఖ్యాంశాలను, ఆర్థిక ఏకీకరణకు ప్రణాళికను వివరించే అవకాశముంది. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా తొలిసారి ఈ సమావేశం వర్చువల్గా జరగనుంది.
16న ఆర్బీఐ భేటీలో సీతారామన్ ప్రసంగం - budget news
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 16న ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ బడ్జెట్ అనంతర భేటీలో ప్రసంగించనున్నారు. ఇందులో ఆమె ఆర్థిక ఏకీకరణ ప్రణాళిక గురించి వివరించే అవకాశముంది.
ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సమావేశంలో సీతారామన్ ప్రసంగం
కరోనా నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యయాలు ఆదాయాన్ని మించి భారీగా పెరిగాయి. ఫలితంగా ద్రవ్యలోటు జీడీపీలో 9.5 శాతానికి పెరగొచ్చని అంచనాలున్నాయి. 2021-22లో ఇది 6.8 శాతంగా నమోదవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 2026 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ఇది 4.5 శాతానికి దిగొస్తుందని అంచనా వేస్తోంది.
ఇదీ చదవండి:'కొవిడ్ కాదు.. ఆ వ్యాధులపైనే బడ్జెట్ దృష్టి'