ఆత్మనిర్భర భారత్ అభియాన్‌లో భాగంగా మూడో రోజు ఆర్థిక ప్యాకేజీ వివరాలు వెల్లడించారు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్. మొత్తం 11 అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు. ఇందులో 8 మౌలిక వసతుల బలోపేతం, నిల్వ సామర్థ్యం పెంపునకు సంబంధించినవి కాగా.. 3 పరిపాలనాపరమైన సంస్కరణలు ఉన్నట్లు వెల్లడించారు.
వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు కేటాయింపు సహా మత్స్యకారులకు ప్రయోజనం కలిగేలా మత్స్య సంపద యోజన తీసుకొస్తున్నట్లు ప్రకటించారు నిర్మల.
మౌలిక వసతుల అభివృద్ధికి 8 చర్యలు
1. లక్ష కోట్ల నిధి
- మౌలిక వసతుల అభివృద్ధికి సాధ్యమైనంత త్వరలో లక్ష కోట్ల నిధి ఏర్పాటు
- అగ్రిగేటర్లు, కో-ఆప్‌లు ద్వారా నిధుల అందజేత
- కోల్డ్ స్టోరేజ్‌లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రైవేటు సంస్థలు, స్టార్టప్‌లు
2. మైక్రో ఫుడ్ ఎంటర్‌ప్రైజెస్‌కు...
- మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ కోసం 10 వేల కోట్ల నిధి
- ప్రధాని చెప్పిన 'వోకల్ ఫర్ లోకల్' సాకారం చేసే దిశగా కేటాయింపులు
- స్థానిక ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయి విపణులకు చేర్చేందుకు నిధితో సాయం
- దేశవ్యాప్తంగా స్థానిక ఆహార ఉత్పత్తుల ఆధారంగా క్లస్టర్ల ఏర్పాటు
- స్థానికంగా ఉన్న ప్రత్యేక ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్
- రెండు లక్షల మైక్రో ఫుడ్ ఎంటర్‌ప్రైజెస్‌కు ప్రయోజనం
3. మత్స్యకారులకు
- ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా మత్స్యకారులకు రూ.20 వేల కోట్లు
- ఆక్వాకల్చర్ కోసం 11 వేల కోట్లు కేటాయింపు
- మౌలిక వసతుల కోసం 9 వేల కోట్లు
- ఈ చర్యలతో రానున్న ఐదేళ్లలో అదనంగా 70 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి
- 55 లక్షల మందికి ఉపాధి
- ఎగుమతుల విలువ రెట్టింపై లక్ష కోట్లకు చేరే అవకాశం