కరోనా మహమ్మారి ప్రభావంతో దెబ్బ తిన్న దేశ ఆర్థిక వ్యవస్థను వేగంగా ముందుకు నడిపించేందుకు, వృద్ధిని గాడిలో పెట్టేందుకు అనువైన బడ్జెట్ రూపొందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. గతంలో ఎన్నడూ చూడని బడ్జెట్‌ను వచ్చే ఆర్థిక సంవత్సరానికి తయారు చేస్తామని ఆమె భరోసా ఇచ్చారు. సీఐఐ (భారతీయ పరిశ్రమల సమాఖ్య) పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2020 కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడారు.
"కొవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్యం, వైద్య పరిశోధన-అభివృద్ధిపై (ఆర్‌అండ్‌డీ) పెట్టుబడులు పెట్టడానికి, టెలిమెడిసిన్‌ను నిర్వహించడానికి ఎక్కువ నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఎంతో కీలకం. సరికొత్త జీవన విధానంలో వృత్తి శిక్షణ, నైపుణ్యాభివృద్ధిపై అనేక సవాళ్లను కూడా ఎదుర్కోవల్సి రావచ్చు. అందుకే పరిశ్రమల నుంచి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తున్నాను. ఒక మహమ్మారి విజృంభించిన తరవాత ఎప్పుడూ లేనివిధంగా బడ్జెట్‌ను రూపొందిద్దాం"
-నిర్మలా సీతారామన్