తెలంగాణ

telangana

ETV Bharat / business

నీరవ్ కేసులో ట్విస్ట్- అప్రూవర్​గా మారిన సోదరి - నీరవ్ మోదీ సోదరి అప్రూవర్ పూర్వి మోదీ

నీరవ్ మోదీ సోదరి పూర్వి, ఆమె భర్త మయాంక్ మెహతా అప్రూవర్లుగా మారారని ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. భారత్​ సహా విదేశాల్లోని ఫ్లాట్ల జప్తుతో పాటు.. బ్యాంకు ఖాతాల్లోని నగదు మోసాలపై సహకరిస్తామని ఇరువురు తెలిపారని ఈడీ స్పష్టం చేసింది.

Nirav
నీరవ్ కేసులో ట్విస్ట్- అప్రూవర్లుగా మారిన ఇద్దరు

By

Published : Jan 7, 2021, 5:30 PM IST

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీరవ్ సోదరి పూర్వి మోదీ, ఆమె భర్త మయాంక్ మెహతా అప్రూవర్లుగా మారారు. న్యూయార్క్​లో రెండు ఫ్లాట్లు, లండన్, ముంబయిలో ఒక్కో ఫ్లాట్​ను జప్తు చేసేందుకు సహకరిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది

మరోవైపు, ముంబయిలోని ఓ బ్యాంకు ఖాతా సహా స్విస్ బ్యాంకులోని రెండు ఖాతాల్లోని రూ. 579 కోట్ల నిధుల విషయంలో జరిగిన మోసాల కేసుల్లోనూ వీరు అప్రూవర్లుగా మారారని ఈడీ తెలిపింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details