పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)కి దాదాపు రూ.14 వేల కోట్లు ఎగ్గొట్టి.. విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యూకే కోర్టు షాకిచ్చింది. నీరవ్‌పై మనీలాండరింగ్ అభియోగాలు రుజువయ్యాయని పేర్కొంది. నీరవ్‌ను విచారించేందుకు భారత్‌కు అప్పగించాలని తీర్పు వెలువరించింది.
భారత్‌కు నీరవ్ మోదీ అప్పగింత! - నీరవ్ మోదీకి ముంబయి జైలు సరిపోతుంది
पंजाब नेशनल बैंक से करीब दो अरब डॉलर की धोखाधड़ी के मामले में वांछित हीरा कारोबारी नीरव मोदी के भारत प्रत्यर्पण पर लंदन की एक अदालत ने मंजूरी दे दी है.
భారత్‌కు నీరవ్ మోదీ అప్పగింత
16:26 February 25
భారత్‌కు అప్పగిస్తే తనకు న్యాయం జరగదని, ఆరోగ్య స్థితి సరిగ్గా లేదనే సాకులతో నీరవ్ చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టిపారేసింది. భారత్‌కు అప్పగిస్తే అన్యాయం జరుగుతుందనేందుకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
నీరవ్‌కు ముంబయి ఆర్థర్ రోడ్ జైలులోని 12వ బ్యారక్ సరిపోతుందని పేర్కొంది కోర్టు. అక్కడే ఆయనకు కావాల్సిన చికిత్స కూడా అందించాలని సూచించింది.
Last Updated : Feb 25, 2021, 5:08 PM IST