ప్రజా పంపిణీ వ్యవస్థ సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'వన్ నేషన్, వన్‌రేషన్ కార్డు' విధానాన్ని 9 రాష్ట్రాలు అమల్లోకి తీసుకొచ్చాయి. దీంతో ఆయా రాష్ట్రాలు రూ.23,523 కోట్లు అదనంగా అప్పులుగా తీసుకునేందుకు అనుమతించినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా.. గోవా, గుజరాత్, హరియాణా, కర్ణాటక, కేరళ, త్రిపుర, ఉత్తర్‌ప్రదేశ్ ఈ జబితాలో ఉన్నాయి.
ఈ విధానాన్ని తీసుకురావడం ద్వారా గరిష్ఠంగా యూపీ రూ.4851 కోట్ల మేర అప్పు తీసుకునే వెసులుబాటు లభించింది. ఆ తర్వాత కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు లబ్ధి పొందనున్నాయని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. రాష్ట్రాలు అదనంగా రుణం పొందాలంటే 2020 డిసెంబర్ 31 వరకు గడువు ఉందని పేర్కొంది. ఈ లోగా మరిన్ని రాష్ట్రాలు ఇందులో చేరతాయని ఆశాభావం వ్యక్తంచేసింది.