వరుసగా ఐదో రోజు నష్టాలతోనే ముగిశాయి స్టాక్ మార్కెట్లు. ఉదయం నుంచి భారీ నష్టాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్లు.. సెషన్ ముగిసే సమయానికి స్వల్పంగా కోలుకున్నాయి.
సెన్సెక్స్ 143 పాయింట్లు కోల్పోయి 39,746 వద్ద స్థిరపడింది. 45 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 11,633 పాయింట్లకు చేరింది.