తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఇకపై ఫాస్టాగ్​లో కనీస నగదు నిల్వ అవసరం లేదు' - భారత జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ

ఫాస్టాగ్‌ వ్యాలెట్‌లో కనీస నగదు నిబంధనను ఎత్తివేస్తున్నట్లు భారత జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఫాస్టాగ్‌ జారీ చేసే కొన్ని బ్యాంకులు ప్రభుత్వం సూచించిన కనీస వేతనం కంటే అదనంగా వ్యాలెట్‌లో ఉండేలా చేస్తున్నట్లు తెలిపింది. ఫలితంగా టోల్‌ప్లాజాల వద్ద చెల్లించేందుకు సరిపడ నగదు వ్యాలెట్‌లో ఉన్నప్పటికీ, చెల్లింపులు జరగక వాహనదారులు ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొంది

NHAI removes requirement of maintaining minimum amount in FASTag Wallet
'ఇకపై ఫాస్టాగ్​లో కనీస నగదు నిల్వ అవసరం లేదు'

By

Published : Feb 10, 2021, 6:09 PM IST

వాహనదారులు ఇకపై తమ ఫాస్టాగ్‌ ఖాతాల్లో కనీస నగదును కలిగి ఉండాల్సిన పని లేదని భారత జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ(ఎన్​హెచ్​ఏఐ) పేర్కొంది. ఫాస్టాగ్‌ను కలిగి ఉండే వాహనదారులు కనీసం నగదు నిల్వను ఖాతాల్లో కలిగి ఉండాలన్న నిబంధనను కేంద్రం విధించింది. అయితే ఫాస్టాగ్‌ జారీ చేసే కొన్ని బ్యాంకులు ప్రభుత్వం సూచించిన కనీస వేతనం కంటే అదనంగా వ్యాలెట్‌లో ఉండేలా చేస్తున్నట్లు ఎన్​హెచ్​ఏఐ తెలిపింది.

ఫలితంగా టోల్‌ప్లాజాల వద్ద చెల్లించేందుకు సరిపడ నగదు వ్యాలెట్‌లో ఉన్నప్పటికీ, చెల్లింపులు జరుగక వాహనదారులు ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొంది. కాబట్టి వాహనదారులకు అలాంటి సమస్య ఎదురుకాకుండా కనీస నగదు నిబంధనను తొలగిస్తున్నట్లు ఎన్​హెచ్​ఏఐ తెలిపింది.

అటు 2కోట్ల 54లక్షలకు పైగా ఫాస్టాగ్‌ ఖాతాలు ఉన్నాయన్న ఎన్​హెచ్​ఏఐ టోల్‌ప్లాజా చెల్లింపుల్లో 80శాతం వాటి ద్వారానే జరుగుతున్నట్లు తెలిపింది. అలాగే ఫాస్టాగ్‌ రోజువారీ చెల్లింపులు 89 కోట్లకు చేరినట్లు చెప్పింది. ఫిబ్రవరి 15నుంచి ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం గతంలోనే ఆదేశాలు జారీచేసింది.

ఇదీ చూడండి:'సాగు చట్టాల వల్ల ఏం నష్టం జరిగింది?'

ABOUT THE AUTHOR

...view details