జర్మనీ వాహన తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ 2021 చివరి నాటికి హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో అత్యంత విజయవంతమైన నెక్స్ట్ జెనరేషన్ 'పోలో'ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. దీనితో పాటు రెండు కొత్త ఎస్‌యూవీలైన 'అట్లాస్ క్రాస్', 'టైగన్'ను భారత మార్కెట్లోకి విడుదల చేయాలని యోచిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు కంపెనీ ఇండియా డైరెక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న గ్లోబల్-స్పెక్ పోలో హ్యాచ్‌బ్యాక్‌కు నూతన ఫీచర్లను జోడిస్తూ రూపొందించిన నెక్ట్స్-జెన్ పోలోను కంపెనీ వ్యూహాత్మక వ్యాపార వేదిక అయిన ఎమ్‌క్యూబీ-ఏఓ ప్లాట్‌ఫాంపై విడుదల చేయనున్నట్లు గుప్తా వివరించారు.