భారత మార్కెట్లో తక్కువ సమయంలోనే బ్రాండెడ్ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థగా ఎదిగింది రియల్మీ. ఇప్పుడు మార్కెట్లో మరింత సుస్థిరతను సాధించేందుకు వెంటవెంటనే కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తోంది. ఇందులో భాగంగా నేడు రియల్మీ-6, 6 ప్రో పేర్లతో రెండు స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది.
అయితే.. వీటి ధర పరంగా మాత్రం ఈ మోడళ్లకు రియల్మీ-5 కి భారీ వ్యత్యాసం ఉండనున్నట్లు తెలుస్తోంది.
రియల్మీ-6, 6 ప్రో ఫీచర్ల అంచనాలు..
- ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 6.4 ఇంచుల డిస్ప్లేతో ఈ మోడల్ రానుంది.
- 64 ఎంపీల రియర్ కెమెరాను కొత్త మోడల్లో పొందుపరిచినట్లు రియల్మీ ఇప్పటికే స్పష్టం చేసింది. 20x జూమింగ్ సదుపాయం ఉండనుంది.
- 16 ఎంపీల ఫంచ్హోల్ సెల్ఫీ కెమెరా(6 ప్రోలో 16+5 ఎంపీ)
- మీడియా టెక్ హీలియో జీ90 ఆక్టాకోర్ ప్రాసెసర్ (స్నాప్డ్రాగన్ 720 జీ)
- 4,200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం (6 ప్రోలో 5,000 ఎంఏహెచ్)
- వూక్ ఛార్జింగ్ సపోర్ట్, 15 నిమిషాల్లో 40 శాతం బ్యాటరీ నింపే సామర్థ్యంతో రియల్మీ-6 అందుబాటులోకి రానుంది.