సెప్టెంబర్ 1 నుంచి ఈపీఎఫ్ నియమాలు(EPF Rules) మారాయి. ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయని పక్షంలో కంపెనీ(యజమాని) వాటా జమ కాదు. దీనికి సంబంధించి కొన్ని నెలల క్రితమే ఈపీఎఫ్‌ఓ(EPFO) సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. యూఏఎన్-ఆధార్ అనుసంధానం కాకపోతే.. ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్(ఈసీఆర్)(Electronic challan cum receipt) భర్తీ కాదు. అంటే ఉద్యోగులు వారి సొంత పీఎఫ్ ఖాతాను చూడగలిగినప్పటికీ, కంపెనీ వాటాను మాత్రం పొందలేరు. ప్రావిడెంట్ ఫండ్ రెగ్యులేటర్ కూడా అన్ని ఈపీఎఫ్ ఖాతాదారుల యూనివర్సల్ అకౌంట్ నంబర్(యూఏఎన్)- ఆధార్ అనుసంధానించాలని యాజమాన్య సంస్థలను ఆదేశించింది. ఇంతకు ముందు ఈపీఎఫ్ - ఆధార్ లింక్ కోసం 30 మే 2021 వరకు గడువు ఉంది. కానీ తర్వాత, ఈపీఎప్ఓ - ఆధార్ లింక్ చివరి తేదీని 2021 ఆగస్టు 31 వరకు పొడిగించింది.
ఏ ఇతర పొదుపులతో పోలిస్తే అత్యధికంగా 8.5% వడ్డీ రేటు ఉండటం ఉద్యోగులకు లాభదాయకం. ఈపీఎఫ్‌లో ఉద్యోగికి కొవిడ్ - 19 అడ్వాన్స్ తీసుకోవడం, పీఎఫ్ బీమా, ఇతర పొదుపు పథకాల కన్నా అధిక వడ్డీ రేటు పొందడం వంటి అనేక ప్రయోజనాలు, ఉపయోగాలున్నాయి.