కియా మోటార్స్ ఇండియా కొత్త లోగోను ప్రవేశ పెట్టింది. దక్షిణకొరియా దిగ్గజం కియా కార్పొరేషన్‌కు పూర్తిస్థాయి అనుబంధ సంస్థ అయిన కియా ఇండియా, మే మొదటి వారం నుంచి సెల్టోస్, సోనెట్ కార్లను కొత్త లోగోతో విడుదల చేస్తుంది. బ్రాండ్ నినాదంగా 'స్ఫూర్తినిచ్చే పయనం'ను ఎంచుకుంది.
కియా నుంచి 2022లో మరో మోడల్ - Kia new model
ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్.. 2022లో మరో మోడల్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇండియా తన కొత్త లోగోను ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ఈ విషయాన్ని వెల్లడించింది. అలాగే మే మొదటి వారం నుంచి కార్లను కొత్త లోగోతో విడుదల చేస్తుంది.

కియా కార్లు
దక్షిణ కొరియా తర్వాత ఇలా బ్రాండు మార్పును భారత్‌లోనే చేసినట్లు కియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కుఖ్యూన్ షిమ్ తెలిపారు. ప్రీమియం కార్ల విభాగంలో బలోపేతం కావడానికి, సాధ్యమైనంత త్వరగా డెలివరీ ఇచ్చేందుకు అనంతపురం ప్లాంటును పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాదిలో కొత్త మోడల్‌ను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:భారత్ రకం వైరస్‌పై కొవాగ్జిన్, కొవిషీల్డ్ భేష్